Steve Smith bags top honours at ICC Awards 2015

Ab de villiers steve smith sweep top honours at 2015 icc awards

ab de villiers, cricketer of the year, icc, icc awards 2015, icc cricketer of the year, sir garfield sobers trophy, steve smith, International Cricket Council (ICC), Cricket, ICC Awards, ICC Cricketer of the Year, Stafanie Taylor, Meg Lanning, Richard Kettleborough, Brendon McCullum, Khurram KhanJosh Hazlewood, Faf du Plessis

Australia skipper Steve Smith's incredible run continues with highest individual honour

స్టీవ్ స్మీత్, డివీలర్స్ లకు పురస్కారాలు.. జాబితాలో మనవారు కానరారు..

Posted: 12/23/2015 07:30 PM IST
Ab de villiers steve smith sweep top honours at 2015 icc awards

అంతర్జాతీయి క్రికెట్ కౌన్సిల్ వార్షిక అవార్డుల్లో భారత క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. ఈ ధఫా అవార్డులన్నింటినీ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ క్రికెటర్లు కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాప్ లో నిలిచాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.

2015 సంవత్సరానికి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన స్మిత్ ప్రతిష్టాత్మక సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ పురస్కారం అందుకోనున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్. అంతకుముందు రికీ పాంటింగ్, మిచెల్ జాన్సన్, మైఖేల్ క్లార్క్ ఈ పురస్కారం అందుకున్నారు. దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైయ్యాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ ద్వారా అవార్డులు ప్రకటించారు.

* టి20 పెర్ ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్: డూ ప్లెసిస్(దక్షిణాఫ్రికా)
* ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: జోష్ హాజిల్ వుడ్(ఆస్టేలియా)
* స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డ్: బ్రెండన్ మెక్ కల్లమ్(న్యూజిలాండ్)
* అంపైర్ ఆఫ్ ది ఇయర్: రిచర్డ్ కెటెల్ బారో
* వుమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: మెగ్ లానింగ్(ఆస్ట్రేలియా కెప్టెన్)
* వుమెన్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: స్టాఫానీ టేలర్(వెస్టిండీస్ కెప్టెన్)

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Steve Smith  ICC awards  Cricketer of the Year  

Other Articles