Watch: Child on tracks miraculously gets saved from the rushing train

Child saved from crushing under local train by alert passenger

Mumbai local train, Ambernath railway station, Mumbai, child, Thane, child, pulled off, CCTV, Badlapur Railway Protection Force, child, local train, Mumbai, Badlapur

In a shocking incident, a child was saved in the nick of time from being run over by a local train at the Ambernath railway station.

ITEMVIDEOS: చిరంజీవ.. చిరంజీవ.... రెప్పపాటులో చిన్నారిని కాపాడిన ప్యాసింజర్లు..

Posted: 12/22/2015 07:33 PM IST
Child saved from crushing under local train by alert passenger

పెద్దలు మాట సద్దన్నం మూట అన్నట్లు.. నిజంగా నూకలు వున్నవాడు రైలుకు ఎదురెళ్లినా వాడికేమీ కాదనడంలో మాత్రం వాస్తవం వుంది. అదే దురదృష్టవంతుడు ఎంతలా ప్రమాదానికి దూరంగా వున్నా అతడు పట్టుకున్న తాడు.. పాముగా మారి కాటేస్తుంది. ఇది విన్నప్పుడు తెలియదు కానీ.. ఇలాంటి ఘటనలను చవిచూసినప్పుడు మాత్రం నిజమేననిపిస్తుంది. తాజాగా అలాంటి సంఘటన గురించి తెలిసిన తర్వాత నిజంగా అదృష్టం, దురదృష్టాలు వుంటాయన్న నమ్మకం కలగక తప్పదు మానవమాత్రులకు. అబ్బే అదేంటి అనుకుంటున్నారా..? అసలా సంఘటన వివరాలేంటి అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళ్తే.. థానేలోని అంబర్ నాథ్ అనే రైల్వే స్టేషన్ జనాలతో కిక్కిరిసి ఉంది.

సరిగ్గా ప్లాట్ ఫాం కంటే కొద్ది ఎత్తు మాత్రమే ఆ పిల్లాడు ఉన్నాడు. రైలు వేగంగా వస్తోంది. ప్రయాణీకులంతా ఏం జరుగుతుందో అని కంగారు పడిపోతున్నారు. ఇంతలో రైల్వే పోలీసు ఎంతో సాహసంతో ఆ అటునుంచి లోకల్ రైలు వేగంగా దూసుకొస్తుంది. అది గమనించని ఓ పిల్లాడు అవతలి ప్లాట్ ఫాం నుంచి ఇవతలి వైపు దూసుకొచ్చాడు.పిల్లాడికి చేయందించాడు. అదే సమయంలో మిగితా ప్రయాణీకులు కూడా అతడిని రక్షించేందుకు కానిస్టేబుల్ కు తోడయ్యాడు. సరిగ్గా అతడిని రైలు సమీపించే సమయానికి పైకి లాగారు. దీంతో రెప్పపాటులో ఆ పిల్లాడి ప్రాణం ప్రమాదం నుంచి బయటపడింది. రైల్వే కానిస్టేబుల్ సాహసాన్ని అక్కడి ప్రయాణీకులు అభినందించారు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai local train  Ambarnath railway station  Thane  child  CCTV  

Other Articles