jet-airways passenger bus hits air india plane in Kolkata

Passenger coach crashes into stationary plane at kolkata airport

Jet Airways, Air India flight, Kolkata Airport, coach bus, Kolkata airport,bus crashes into plane,bus rams aircraft,Jet Airways bus rams Air India plane

A Jet Airways bus crashed into an Air India aircraft parked at the Kolkata airport this morning, damaging it badly.

కోల్ కతా విమానాశ్రయంలో విమానాన్ని ఢీకొట్టిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం

Posted: 12/22/2015 11:12 AM IST
Passenger coach crashes into stationary plane at kolkata airport

గగనతలంలో విహరించే విమానాన్ని, భూ ఉపరితలంపై ప్రయాణించే బస్సు ఢీకొట్టింది. కోల్ కతా విమానాశ్రంలో ఈ ఘటన చోటుచేసుకున్నా.. చివరకు పెను ప్రమాదం తప్పింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగిఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని జెట్ ఎయిర్ వేస్ కు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో విమానం కొంత భాగం ధ్వంసమైంది. ఆ సమయంలో విమానంలో ప్రయాణీకులు లేరు. ఈ ఘటన తెలిసి ఒక్కసారిగా విమానాశ్రయ అధికారులు ఉలిక్కి పడ్డారు.

ఈ ఘటనలో విమానానికి పెద్దగా నష్టమేమీ జరగనలేదు. అటు బస్సులో ఉన్న ప్రయాణికులకు సైతం ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా వున్నారు. ఎలాంటి ప్రాణనష్టం, పెద్దగా ఆస్తి నష్టం కూడా లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  విమానం రెక్క మాత్రం భారీగా దెబ్బతింది. ఇక బస్సు మరింత వేగంగా వచ్చి ఢీకొట్టి ఉంటే భారీ విస్ఫోటనమే జరిగేదని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. బస్సు వేగంగా వెళ్లి ఢీ కొట్టినా..ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది

.విమానాన్ని ఢీకొన్న బస్సు విమానం ఇంజిన్ కు కాస్తంత దూరంగానే నిలిచింది. అలా కాకుండా విమానం ఇంజిన్ ను బస్సు తాకి ఉంటే మాత్రం పెద్ద పేలుడే సంభవించి ఉండేది. ఇటీవల విమానాశ్రయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం అసోంలోని సిల్చార్ కు వెళ్లాల్సి ఉంది. ఈ ఘటన జరగడానికి గల కారణాలపై విమానాశ్రయ అధికారులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jet airways bus  air india plane  hits  kolkatta  

Other Articles