are they not our telugu sisters..? critics surround ap government

Chandrababu government faces critics on call money

Andhra pradesh intelligence failed once again, AP intelligence failed again, chandrababu, andhrapradesh, Intelligence, Call money, TDP, YSRCP, congress, JaganMohanreddy, Jagn, Raghuveera Reddy, Chiranjeevi, call money scandal, call money scam, call money victims

How it that government is not showing keen interest to push all the culprits and of call money behind bars,

వాళ్లు తెలుగింటి ఆడపడుచులు కాదా..? ఓట్లే కాని బాధ అవసరం లేదా..?

Posted: 12/17/2015 12:24 PM IST
Chandrababu government faces critics on call money

విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన కాల్ మనీ కుంభకోణంలో మోసపోయిన మహిళలు తెలుగింటి అడపడుచులు కాదా..? అంటూ మహిళా లోకం నిలదీస్తుంది. ఎన్నికలకు ముందు వారి వాకిళ్లలోకి.. ఇంటి. లోగిళ్లలోకి వెళ్లి వారి ఓట్లను అడిగి.. మీకు అండగా మేము వుంటామని చెప్పి. తెలుగుదేశం నేతలు.. అధికారంలోకి వస్తే.. యువతులు, మహిళలపై ఎలాంటి అకృత్యాలు, అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించి, హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చక వారితో పనిలేదన్నట్లుగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వెల్లివిరుస్తున్నాయి.

అధికారంలోకి వచ్చి 18 నెలలు కూడా నిండకుండానే.. కాల్ మనీ పేరుతో..కొందరు డబ్బున్న మదాందకారులు.. కామాంధకారులుగా, కాలయముళ్లుగా మారి మహిళల వలువలను విప్పి.. వారిపై అత్యాచారాలకు తెగబడి, ఆ తతంగాన్ని వీడియోలలో బంధించి బలంవంతంగా వ్యహిచారుణులుగా మారుస్తుంటే... ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళలు వ్యభిచారం చేసి తెచ్చే డబ్బును కూడా తన్నుపుపోయి వారి బాడు తింటున్న దుర్మార్గులపై ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా పెరుగుతోంది.

సుపరిపాలనాధ్యక్షుడిగా, మంచి పేరున్న చంద్రబాబు.. ఆ తరహాలో ఇప్పుడు పాలన సాగించడం లేదన్న వార్తలు కూడా ఈ తరుణంలో తెరపైకి వస్తున్నాయి. వేలాది మందిని మహిళలను బాధితులుగా మార్చిన కాల్ మనీ కుంభకోణంలో ఆయన ముందుస్తు చర్యలు తీసుకోలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. తన పాలనలో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని ప్రకటనలు గుప్పించి.. అధికారంలోకి వచ్చినా.. ఇప్పుడాయన దృష్టంతా కేవలం రాజధాని నిర్మాణంపైనే వుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త రాష్ట్రంలో రాజధాని అవసరం ఎంతైనా ముఖ్యమే అయితే.. ప్రజల కష్టసుఖాలు కూడా పట్టించుకోవాలని కదా అన్న వారూ లేకపోలేరు.

నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అని నామకరణం చేయడమే కాదు.. అమరావతికి చరిత్రలో విశిష్టత బౌద్దం పరఢవిల్లిన ప్రాంతంలో. ప్రశాంతత, శాంతం, పరోపకారం ఇత్యాదులను కూడా వర్థిల్లేలా చేయాలని మహిళలు కోరుతున్నారు. రాజధాని నిర్మాణానికి ముందే అపఖ్యాతిని మూటగట్టుకోవద్దన్న సూచనలు కూడా వినబడుతున్నాయి. విజయవాడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేళ్లూనుకున్న ఈ వ్యవహారం పెద్ద స్థాయిలో జరుగుతుంటే ప్రభుత్వానికి తెలియదంటే.. ఇక ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం కాకుండా మరెం పడుతుందన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి.

కాల్ మనీ కాలయముళ్ల వ్యవహారం బయటకు రాకుండా.. పోలీసు అధికారులు కూడా తమ స్థాయిలో రాజీలు కుదర్చుతున్నారంటే వారికి అధికార పార్టీ అండదండలు లేకుండానే ఇలా చేశారా..? అన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా కాల్ మనీ కుంబకోణం వేళ్లూనుకుందంటే.. ఇంత పెద్ద నెట్ వర్క్ ఇప్పటికిప్పడు ఏర్పడింది కాదన్న.. గత కొన్ని నెలలు, ఏళ్లుగా ఈ వ్యాపారం కొనసాగుతుందని అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే ఇందులో రాజకీయ అపేక్షకు తావులేకుండా తెలుగింటి అడపడచులు.. జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కాలయముళ్లకు కఠిన శిక్ష విధించాలని మహిళలు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  andhrapradesh  Call money  victims  

Other Articles