Income Tax officers found eighteen crore rupees in TTDP MLA House

Income tax officers found eighteen crore rupees in ttdp mla house

Rajender Reddy, TTDP, MLA, IT Ride, 18 Crores in MLA House

Income Tax officers found eighteen crore rupees in TTDP MLA House. IT officials ride on TTDP MLA Rajender Reddy house and his belongings.

ITEMVIDEOS: టిటిడిపి ఎమ్మెల్యే ఇంట్లో 18 కోట్లు..?!

Posted: 12/17/2015 09:00 AM IST
Income tax officers found eighteen crore rupees in ttdp mla house

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. గుల్బర్గా, బెంగళూరు నుంచి వచ్చిన ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఒకేసారి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసం, ఆఫీసుతోపాటు రాయచూర్‌లోని వైద్య కళాశాలలో తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో ఆయన ఇళ్లు, కార్యాలయంలో రైడ్ చేసిన అధికారులు 18కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని రాయచూర్ లో ఉన్న రాజేందర్ రెడ్డి నివాసంతో పాటూ, నవోదయ మెడికల్ కాలేజీ, బంజారా హిల్స్ లోని అతని నివాసంలోనూ ఒకేసారి దాడులు చేస్తుండటంతో భారీ మొత్తంలో నగదు బయటపడుతున్నట్టు సమాచారం.

మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యేకు కర్ణాటకలోని రాయచూర్ లో మెడికల్ కాలేజీ ఉంది. ఆ కళాశాలకు సంబంధించి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన సొమ్మును ఆఫీసు లాకర్లో పెట్టినట్లు సమాచారం. దీంతోపాటు ఎమ్మెల్యేకు సంబంధించిన పలు ఆస్తుల డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఐటీ అధికారులు ఈ సోదాలకు సంబందించిన విషయాల మీద ఎంలాటి వార్తలు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. నిజానికి నిన్న ఉదయం నుండి ఈ సోదాలు కొనసాగినా.. రాత్రి వరకూ ఎలాంటి సమాచారం కూడా బయటికి రాలేదు. అయితే రాయచూర్‌లోని వైద్య కళాశాల వద్ద పోలీసుల హడావుడితో ఐటీ దాడుల విషయం వెల్లడైంది. అయితే అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను అధికారులు లోనికి అనుమతించలేదు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajender Reddy  TTDP  MLA  IT Ride  18 Crores in MLA House  

Other Articles