Indias Daughters name was Jyoti Singh

Indias daughters name was jyoti singh

Indias Daughters, Nirbhaya, Jyoti SIngh, Nirbhaya case, Brave Daughter, Delhi Gang Rape

A brave homage to her daughter, the mother of the December 16 gangrape victim today took her name in public, and said people who commit heinous crimes like rape should hang their heads in shame and not the victims or their families. The 23-year-old paramedical student was brutally sexually assaulted on the ill-fated night of December 16 three years ago, and died 13 days later, triggering a massive public outrage. Among many, her spirit continued to live, and in tribute she was given the name 'Nirbhaya' or brave heart.

నిర్భయ అసలు పేరు చెప్పిన తల్లి

Posted: 12/17/2015 08:10 AM IST
Indias daughters name was jyoti singh

డాటర్ ఆప్ ఇండియా.. నిర్భయగా పేరుగాంచిన అమ్మాయి పేరు ఏంటో తెలిసిపోయింది. నిర్భయ తల్లి ఆమె పేరును వెల్లడించింది. నేర‌స్తుల‌కు లేని సిగ్గు త‌మ‌కెందుకంటూ బిడ్డ పేరును ఆమె తల్లి నిర్భయంగా వెల్లడించారు. తన కూతురి పేరు జ్యోతి సింగ్ అంటూ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. ఇకపై ఎవ‌రైనా జ్యోతిసింగ్‌ గానే గుర్తించాల‌ని త‌ల్లి ఆశాదేవి గుండె నిబ్బరం చేసుకుని వెల్లడించారు. నిర్భయ కేసులో మైనర్ గా ఉన్న నేరస్తుడి విడుదలకు గడువు దగ్గర పడుతుండటంతో.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ సమయంలో నిర్భయ తల్లి తన కూతురు పేరును వెల్లడించడంతో పాటుగా.. తన ఆవేదననను కూడా వెల్లగక్కింది.

దేశ రాజధాని దిల్లీలో కామాందుల అకృత్యానికి బ‌లైన నిర్భయ అసలు పేరును ఆమె త‌ల్లి బ‌య‌ట‌పెట్టింది. త‌న కూతురు మృతికి కార‌ణ‌మైన వారిలో ఒక‌ నిందితుడు జువైన‌ల్ యాక్ట్ కింద మూడేళ్ల శిక్ష ముగించుకుని బ‌య‌ట‌కు వ‌స్తున్నాడ‌ు. త‌న బిడ్డ మృతికి కార‌ణ‌మైన ఘ‌ట‌న‌ను త‌ల‌చుకుని నిర్భయ తల్లి కంట తడి పెట్టింది. మ‌రోమారు కంటత‌డి పెట్టారు. న‌డుస్తున్న బ‌స్సులో క్రూరంగా ప్రవ‌ర్తించిన ఆరుగురు మృగాల్లో ఒక‌డికి బాల నేర‌స్తుడన్నకారణంగా మూడేళ్ల కంటే ఎక్కువ శిక్ష వేయ‌క‌పోయింది న్యాయవ్యవస్థ. బాల నేర‌స్తుడి కింద శిక్ష అనుభ‌వించిన వాడు ఈనెల 20న విడుద‌ల అవుతుండ‌డంపై ప్రముఖ న‌టి, ఎంపీ హేమామాలిని. ప్రభుత్వానికి వ్యతిరేకంగా త‌న గ‌ళం వినిపించారు. అయితే.. బాల నేర‌స్తుడి విడుద‌ల ప‌ట్ల ఇంటెలిజెన్స్ బ్యూరో, జువైన‌ల్ హోం అధికారుల మ‌ధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌ర్కార్ త‌దుప‌రి నిర్ణయం ఎలా ఉంటుంద‌న్న దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మరి నాటి బాల నేరస్థుడి విడుదల జరుగుతుందా లేదా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Indias Daughters  Nirbhaya  Jyoti SIngh  Nirbhaya case  Brave Daughter  Delhi Gang Rape  

Other Articles