పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ తన తల్లి రేణుదేశాయ్ కు ఓ లెటర్ రాశాడు. తన తల్లికి పుట్టిన రోజు శుబాకాంక్షలు తెలుపుతూ తన ప్రేమను లెటర్ లో అక్షరాలుగా మలిచి శుభాకాంక్షలు తెలిపాడు. రేణు దేశాయ్ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది ఆమెకు పుట్టిన రోజు శుబాకాంక్షలు తెలిపినా కానీ తన కొడుకు పంపిన లెటర్ ఎంతో ఆనందాన్ని కలిగించిందని సంతోషిస్తోంది. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ లకు అకిరా నందన్, కూతురు ఆద్య ఉన్నారు. తన తల్లి మీద ప్రేమను అకిరా నందన్ ఇలా లెటర్ లో వ్యక్తపరిచాడని.. ఆ లెటర్ ను రేణుదేశాయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. లెటర్ తో పాటు ఫ్రూట్ కేక్ ను తయారుచేసి తన తల్లికి పంపించాడు అకిర్ నందన్.
తన తల్లి రేణుదేశాయ్ కు రాసిన లెటర్ లో తన తల్లి మీద ఉన్న గౌరవాన్ని, ప్రేమను అకిరా నందన్ వెల్లడించాడు. లేఖ సారాంశం ఈ విధంగా ఉంది. నువ్వు లేకపోతే నేను ఈ లోకంలోకి వచ్చి ఉండేవాడిని కాదు. నువ్వే లేకపోతే ప్రేమ, దయ, స్నేహం అనే వాటికి అర్థం తెలిసేది కాదు. నువ్వు ఓ గొప్ప అమ్మవి అని చెబుతూ లేఖలో వ్యక్తపరిచాడు. కుమారుడు తనపై చూపిన ఈ అవ్యాజ్య ప్రేమకు పొంగిపోయిన రేణుదేశాయ్ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఎంత మంది తనకు శుభాకాంక్షలు చెప్పినా కానీ. ఓ తల్లికి తన పిల్లలు చెప్పే నాలుగు ముక్కలు ఎంతో స్పెషల్. రేణుదేశాయ్ కి కూడా అకిరా నందన్ లెటర్ బర్త్ డేను కలర్ ఫుల్ గా చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more