Gurpal Diu, who planned to kill his wife arrested in UK

Man offers 50 lakhs to help him kill his wife

Gurpal Diu, Shezan Rasul, wife and unborn child, Rolls Royce, abortion procedure, prison term for someone who murders their baby, UK police, Man Money Neighbour UK

Man was arrested after he offers money to neighbour to help him kill his pregnant wife in UK.

తన భార్యను అంతం చేస్తే.. 50 లక్షలు ఇస్తాడట..

Posted: 12/16/2015 12:56 PM IST
Man offers 50 lakhs to help him kill his wife

తన జీవిత సహధర్మచారిణి అని తెలిసి కూడా.. తన భార్యను హత్య చేసేందుకు కిరాయి హంతకుడిని మాట్టాడిన ఘనుడి చివరకు కటకటాల పాలయ్యాడు. తన వ్యూహానంతా తెలుసుకుని హత్య చేస్తానన్న వ్యక్తే.. ఈ విషయాన్ని పోలీసులకు పిర్యాదు చేయడంతో కుడిదిలో పడ్డ ఎలుకలా చిక్కాడు సదరు భర్త. అయితే అమె గర్భిణి కావడంతో అమెతో పాటు.. అమె కడుపులో పెరుగుతున్న తన వారసుడిని కూడా అంతం చేయాలనుకున్నాడు. ఇంతకీ హత్య చేసేందుకు కారణమేంటని విచారిస్తే.. వారుసులేనట. వివరాల్లోకి వెళ్తే..

లండన్ లోని గురుపాల్ డ్యూ అనే వ్యక్తి రోల్స్ రాయిస్ అనే సంస్థలో పనిచేస్తున్నాడు. అతడు తనకు వారసులు వద్దని అనుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన భార్య మాత్రం తనకు బిడ్డలు కావాలని పట్టుబట్టింది. ఫలితంగా ఒక బిడ్డకు తల్లి కూడా కాబోతుంది. ఇదే సమయంలో ఇక పిల్లలు వద్దని అతను వారించాడు. అయితే మరో బిడ్డ పుట్టిన తరువాత ఇక చాలనుకుందామని అమె అనింది. అంతే తనకు వారసులు వద్దంటున్నా.. వినిపించుకోకుండా తన భార్య పిల్లల కోసం పట్టుబట్టడం ఇష్టంలేని భర్త.. అమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.

తన భార్యను, అమె కడుపులోని పిల్లాడిని ఎవరైతే చంపుతారో వారికి 50 లక్షల రూపాయలను ఇచ్చేందుకు కూడా సిద్దమయ్యారు. తన పొరుగువారితో ఈ మేరకు డీల్ కూడా మాట్లాడాడు. తన భార్యను హత్యచేసేందుకు ఎవరైనా వుంటే చూసి పెట్టమని అర్థించాడు. అందుకోసం అయన ప్రణాళికను కూడా రచించాడు. తన భార్యకు తెలియకుండా తాను ఇంటి వెనుక ద్వారం తెరిచి వుంచుతానని అక్కడి నుంచి వచ్చి అమె తలపై సుత్తితో కానీ లేక గట్టి కర్రతో మోదాలని కూడా చెప్పాడు. ఇంకా అవసరం అనుకుంటే తన ఇంటి తాళం చెవులను కూడా ఇచ్చి వెళ్తానని చెప్పాడు.

పక్కింటి వ్యక్తి ముందు సరదా అంటున్నాడని అనుకున్నాక నిజంగానే అతను భార్యను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసి.. పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి ప్రవేశించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని పర్సనల్ కంప్యూటర్ ను కూడా సీజ్ చేశారు. అయితే పిల్లలు పుట్టకుండా అబార్షన్ చేసే పద్దతులను, ఆ తరువాత తమ బిడ్డను హత్య చేసే వారికి పడే శిక్షా కాలం పై అతను అధికంగా కంప్యూటర్ లో సర్చ్ చేసినట్లు కనుగోన్న పోలీసులు వాటిని సాక్ష్యాలుగా కోర్టులో పొందుపర్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gurpal Diu  Shezan Rasul  wife and unborn child  UK police  

Other Articles