isis | islamic state militants | yazadi women | sex slaves | UN | Islamic countries

Isis militants imprisoned yazidi women in syrian desert dungeon

Islamic State militants Yazidi women, Yazidi minority group, Zoroastrianism, ancient religious traditions, yazadi devil-worshippers, yazadi women girls sex slaves, christian news, christianity, evangelical, Yazidi, Iraq, Syria, Dungeon,Prison, Rape

Islamic State militants imprisoned Yazidi women in a dungeon buried underneath the desert in northern Syria, it has emerged.

ఐఎస్ఐఎస్ దారుణాలు.. యాజాది యువతిని 20 సార్లు అమ్మకం

Posted: 12/16/2015 09:26 AM IST
Isis militants imprisoned yazidi women in syrian desert dungeon

తీవ్రవాదుల ఖాలీఫా రాజ్యం స్థాపన కోసమే అంటూ యుద్దం చేస్తున్న ఇస్తామిక్ త్రీవవాదులు వారి రాజ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోంటన్నారో ఇప్పుడు వారి బందీలను చేస్తే అర్థమవుతుంది. వారి దురాగతాలు వింటే కాటికి కాళ్లు చాపిన వ్యక్తి కూడా శక్తిని తెచ్చుకుని వారిపై తిరగబడాలనుకునేలా వున్నాయి. ఇరాక్ లోని సిజార్ పర్వత శ్రేణుల్లో ఉన్న మైనారిటీ తెగ యాజాదీలు. గత ఆగస్టులో ఈ ప్రాంతంపై ఐఎస్ ఉగ్రవాదులు దాడికి దిగి స్వాధీనం చేసుకున్నారు.

స్థానికంగా పట్టుబడిన  యాజాదీలలోని పురుషులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. మహిళలను, యువతులను వేరు చేసి సిరియాలోని అల్ రఖా నగరానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బందీలుగా దొరికిన యువతులు, మహిళలపై వర్ణనాతీతమైన హింసకు పాల్పడ్డారు. అత్యాచారాలు చేశారు. అనంతరం అల్ రఖా నగరంలో బందీలైన యువతులను అమ్మేశారు. కేవలం సిగిరెట్ ప్యాకెట్ కు ఓ యువతిని అమ్మేశారంటే అక్కడ మహిళలకు వారిచ్చే విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఒక్కో అమ్మాయిని పది డాలర్లకు అమ్మేశారు. వీరిని కొనుగోలు చేసిన వారు వారిని అంగట్లో బొమ్మల్లా చూసేవారు. వారి శరీరంతో ఆడుకునే వారు. మోజు తీరాక ఇంకొకరికి అమ్మేసేవారు. ఇలా ఓ అమ్మాయిని 20 సార్లు అమ్మేశారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ బందీలలో కొద్ది మంది తప్పించుకోగా, ఎక్కువ మంది తప్పించుకునే క్రమంలో మృత్యువాత పడ్డారు. కొందరు ఎదురు తిరిగి అసువులు బాసారు. మరి కొందరు ఐఎస్ తీవ్రవాదుల ఆగ్రహానికి, సరదాకి అంతమయ్యారు. తీవ్రవాదుల చెరలో ఇంకా రెండు నుంచి మూడు వేల మంది యాజాదీ మహిళలు బానిసలుగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

ఇలాంటి అఘాయిత్యాలు, ఘోరాలకు, దారుణాలకు పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ ను ఇకపై ఉపేక్షించ కూడదన్న ఐక్యరాజ్యసమితి పిలుపుకు పలు ముస్లిం దేశాలుకు కూడా మద్దతు ప్రకటించాయి. 34 ముస్లిం దేశాలు కలిపి సంకీర్ణ సేనలను తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా నేతృత్వంలో రియాద్ కేంద్రంగా సంకీర్ణ సేనలు ఐఎస్ పై విరుచుకుపడనున్నాయి. ఈ దేశాల జాబితాలో ఈజిప్ట్, ఖతార్, యూఏఈ, టర్కీ, మలేషియా, పాకిస్థాన్, గల్ఫ్ అరబ్, ఆఫ్రికన్ అరబ్ దేశాలున్నాయి. ఇస్లామిక్ దేశాలను ఉగ్రవాదం నుంచి రక్షించుకోవడం తమ విధి అని ఈ దేశాలు పేర్కొన్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  islamic state militants  yazadi women  sex slaves  

Other Articles