Malendar | Men's Right Calendar | indian metro cities

Mumbai ngo brings out men s right calendar malendar

Malendar, Men's Right Calendar, Father's Day, International Men's Day., Vaastav Foundation President Amit Deshpande, 2000 calendars, major metros cities, manhood, positive images of men, September 18 Wife Appreciation Day, October 10 Violence Against Men, October Boys Awareness Month, November 19 Men's Day, Men's day, Fathers Day, Boy's Day

In a unique promotion of men's rights, a city-based NGO has released an interesting calendar, called 'Malendar', highlighting important days like Father's Day, International Men's Day.

మగవాళ్ల హక్కులు, విశిష్టతలను తెలిపే మేలెండర్..

Posted: 12/16/2015 10:52 AM IST
Mumbai ngo brings out men s right calendar malendar

ఒక్కడైన మైనారిటీగా వున్న వర్గం ఒక జట్టుగా ఏర్పడి.. వారి సంక్షేమాన్ని, అభివృద్దిని ఆ జట్టు తొడ్పడుతుందని ఆశిస్తుంటారు. అనేక మంది ఈ మేరకు సంక్షేమ సంఘాలను కూడా స్థాపించి వారి శ్రేయస్సుకు ఎలాంటి డోకా లేకుండా చూసుకుంటారు. భారతీయులు కూడా పలు దేశాలలో సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసుకున్న ఉదాహరణలను మనం అనేకం చూస్తూనేవున్నాం. అయితే మెజరిటీగా వున్నవారు కూడా ఇలా సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేయడం మాత్రం అరుదుగా జరిగే విషయం. ఇలాంటిదే ఇప్పుడు జరిగింది.

పురుషాధిక్య సమాజంలో పురుషులకే భద్రత కరువైంది. పలువురు స్త్రీల కారణంగా మగవాళ్లు నిత్యం వేదనను అనుభవిస్తున్నారని భార్య బాధితుల సంఘం ఏర్పాటైన విషయం తెలిసిందే. మహిళల దినోత్సవాలు, మదర్స్ డే, బాలికల హక్కుల దినోత్సం తరహాలో ఫాదర్స్ డే, బాలల హక్కుల మాసోత్సవం ఇత్యాదులు నిర్వహించాలని ఇందుకు గాను ఓ క్యాలెండర్ ను రూపోందించారు. దాని పేరు మేలెండర్. దీని ప్రత్యేకత ఏమిటంటే, పురుషుల కోసం ప్రత్యేకంగా ఉండే దినోత్సవాల వివరాలతో దీనిని రూపొందించడమే. ముంబయికి చెందిన వాస్తవ్ ఆర్గనైజేషన్ అనే ఒక ఎన్జీవో సంస్థ పురుషుల హక్కుల కోసం పాటుపడుతోంది.

 ఈ నేపథ్యంలోనే ఈ క్యాలెండర్ ను తయారు చేసింది.  పురుషుల దినోత్సవం, పితృ దినోత్సవం, బాలుర దినోత్సవం.. ఇట్లీ అన్నీ పురుషులకు సంబంధించిన దినోత్సవాల తేదీలను ప్రత్యేకంగా పేర్కొంది. ఈ సందర్భంగా సదరు సంస్థ అధ్యక్షుడు అమిత్ దేశ్ పాండే మాట్లాడుతూ, పురుషుల దినోత్సవాల గురించిన అవగాహన కోసమే దీనిని తయారు చేశామన్నారు. సుమారు రెండు వేల క్యాలెండర్ల వరకు ముద్రించామని, ముఖ్యమైన మెట్రో నగరాల్లో మేలెండర్లను పంపిణీ చేశామని పాండే వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malendar  Men's Right Calendar  indian metro cities  

Other Articles