Vijayawada CP Gautam Sawang Cancels His Leave

Vijayawada cp gautam sawang cancels his leave

Vijayawada, Call MOney, gautham sawang, Gowtham Sawang, Vijayawada CP Gautham Sawang, Gautham Sawang leave, Gautham Sawang cancels his leave

Vijayawada CP Gautam Sawang Cancels His Leave. On the effect of call money case, Vijayawada CP Gautham Sawang cancels his leave.

ITEMVIDEOS: సెలవు రద్దు చేసుకున్న విజయవాడ కమీషనర్

Posted: 12/16/2015 12:49 PM IST
Vijayawada cp gautam sawang cancels his leave

కాల్ మనీ కేసు విచారిస్తున్న విజయవాడ కమీషనర్ తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కాల్ మనీ కేసు మీద ఏపిలో తీవ్ర కలకలం రేగుతున్న సమయంలో కమీషనర్ గౌతమ్ సవాంగ్ సెలవు మీద వెళ్లడం మీద తీవ్ర దుమారమే రేగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలనే కేసును నీరు గార్చేందుకు.. గౌతమ్ సవాంగ్ ను సెలవు మీద పంపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే నిజానికి చాలా రోజుల ముందే గౌతమ్ సవాంగ్ సెలవు కోసం అప్లై చేశాడనపి పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అయితే తాజాగా కేసు తీవ్రత దృష్యా తాను సెలవు మీద వెళ్లడం లేదని ఆయన స్వయంగా ప్రకటించారు.

Also Read: కోరిక తీరిస్తే... వడ్డీ కట్టేందుకు గడువు పెంచుతాడట..!

గౌతమ్ సవాంగ్ ఈ సందర్భంగా సెలవు రద్దు మీద వివరణ ఇచ్చుకున్పారు. 'సెలవు రద్దు చేయాలని తాను అడిగానని... దాంతో డీజీపీ కూడా వెంటనే రద్దు చేశారని వెల్లడించారు.  పండగ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆస్ట్రేలియాలో కలవాలని అనుకున్నామని... కానీ కేసు తీవ్రత చూసిన తర్వాత, ప్రజలంతా కూడా నన్ను ఉండాలని ఒత్తిడి చేయడంతో సెలవు రద్దుచేసుకున్నానని సవాగ్ వెల్లడించారు. ఇందులో రాజకీయం ఏమీ లేదని.. ఒత్తిళ్లు కూడా లేవని తెలిపారు. చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయని.. అయితే తాము మాత్రం ఈ కేసును వ్యవస్థాగతంగా, లాజికల్‌గా విచారణ చేస్తున్నామని ప్రకటించారు.  ఏరకమైన ఒత్తిడి కూడా లేదని.. దయచేసి అలాంటి మాటలు తీసుకురావద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇది పెద్ద సమస్య. దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని సవాంగ్ భరోసానిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  Call MOney  gautham sawang  Vijayawada CP Gautham Sawang  

Other Articles