60 thousand laddus missing in TTD

60 thousand laddus missing in ttd

TTD, TTD Laddu, Tirupati Laddu, Tirupati, Tirumala, Venkateshwara Swamy Temple

in Tirumala tirupati temple, 60 thousand laddus missing in one year. A employee in TTD, sold the missing laddu in black market.

తిరుమలలో 60 వేల లడ్డూలు మాయం

Posted: 12/15/2015 10:18 AM IST
60 thousand laddus missing in ttd

తిరుమల శ్రీవారి పేరు చెబితే భక్తులు పరవశంతో పులకించిపోతారు. భక్తుల కొంగు బంగారంగా నిలిచే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలివస్తారు. శ్రీవారి దర్శనం కోసం ఎంతలా వేచి చూస్తారో.. శ్రీవారి ప్రసాదం లడ్డూ కోసం కూడా భక్తులు అంతే ఎదురుచూస్తారు. అయితే తాజాగా తిరుమలగిరిలో లడ్డుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 వేల లడ్డూల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో పని చేస్తున్న ఓ టిటిడి ఉద్యోగి దీనికి మూల కారణం. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూతో వ్యాపారం చేసి లక్షలు పోగేసిన ఉద్యోగి బండారం బయటపడింది. అరవై వేల లడ్డూల మాయం పై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న వెంకటరమణ అనే ఉద్యోగి గత కొంత కాలంగా లడ్డూలను అక్రమంగా దారిమరల్చాడు. అలా నెలకు 400 నుండి 600 వరకు అడ్డూలను అక్రమంగా మార్కెట్ లో అమ్ముకున్నారు. ఏడాదిలో దాదాపు 60 వేల లడ్డూలను అతడు మాయం చేసినట్లు ఎండోమెంట్ ఆఫీసర్ గుర్తించారు. దాతలకు ఇచ్చే లడ్డూలను అనుమానం రాకుండా.. కాజేస్తూ లక్షలు పోగేశాడు. ఇప్పటికే తిరుమల లడ్డూలపై ఎన్నో వివాదాలు నడుస్తుండగా తాజాగా మరో వివాదం తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే 60 వేల లడ్డూలు మాయమయ్యేంత వరకు టిటిడి అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. కానీ ప్రస్తుతానికి దీనిలో ఎవరెవరు పాత్రపోషించారు అన్న విషయాలు తెలియలేదు. కాగా వెంకటరమణను సస్పెండ్ చెయ్యలమే కాకుండా మొత్తం వ్యవహారం మీద టిటిడి విచారణను ఆదేశించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD  TTD Laddu  Tirupati Laddu  Tirupati  Tirumala  Venkateshwara Swamy Temple  

Other Articles