Possible relief for Salman Khan

Possible relief for salman khan

Salman Khan, hit and Run case, 2002 Hit and Run case, Salman Khan case in court

The Bombay High Court Tuesday questioned the manner in which the blood samples of Salman Khan were collected and analysed in the 2002 hit-and-run case involving the actor, observing that “requisite and necessary care was not taken while taking the blood sample”.

సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ నుండి ఊరట..!

Posted: 12/09/2015 04:06 PM IST
Possible relief for salman khan

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ప్రధాన సాక్షి రవీంద్ర పాటిల్ వాదనను బొంబాయి హైకోర్టు తోసిపుచ్చింది. 2002 సెప్టెంబర్ 28న జరిగిన ఈ ఘటనలో రోడ్డుపక్కన పేవ్మెంట్ మీద పడుకున్న ఓ వ్యక్తి చనిపోయాడు. నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ రవీంద్ర పాటిల్ ప్రధాన సాక్ష్యంగా చెప్పిన వాదనలో అంశాలు అసంబద్దంగా ఉన్నాయని హైకోర్ట్ పేర్కొంది.

'సల్మాన్ తాగి ఉన్నాడని, సంఘటనాస్థలం నుంచి పారిపోయే సమయంలో ఆయన రెండుసార్లు తూలి పడిపోయాడని సాక్షి చెప్పాడు. దీనినిబట్టి ప్రాసిక్యూషన్ ప్రధాన సాక్షి రవీంద్ర పాటిల్ ఆయన తాగి ఉన్నట్టు చూసే అవకాశముండదు. 2012 అక్టోబర్ 1 తర్వాతే దర్యాప్తులో మద్యం అంశం వెలుగులోకి వచ్చింది' అని హైకోర్టు పేర్కొంది. అలాగే సల్మాన్ ఖాన్ కు చేసిన రక్త పరీక్షలు కూడా సరిగ్గాలేనట్లు హైకోర్ట్ కు సల్మాన్ తరఫున లాయర్ వివరించారు. 2002 పెప్టెంబర్ 28న ఘటన జరిగిన తర్వాత సల్మాన్ ఖాన్ నుండి రక్త నమూనాలు సేకరించారని.. అవి సెప్టెంబర్ 30వ తేది ల్యాబ్ కు చేరాయని వెల్లడించారు. అలాగే మామూలుగా పరీక్షలకు 6 ఎంఎల్ ల రక్తాన్ని సేకరిస్తుండగా సల్మాన్ ఖాన్ నమూనాల కోసం కేవలం 4ఎంఎల్ ల రక్త మాత్రమే ల్యాబ్ కు చేరిందని వెల్లడించారు. కాబట్టి ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా వందకు వంద శాతం జెన్యూన్ కాదని సల్మాన్ ఖాన్ తరఫు లాయర్ వాదించారు. మొత్తానికి సల్మాన్ ఖాన్ కు ఈ కేసులో ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  hit and Run case  2002 Hit and Run case  Salman Khan case in court  

Other Articles