Modi govt doing vendetta on us

Modi govt doing vendetta on us

Rahul Gandhi, vendetta, national herald, vendetta on Rahul Gandhi, Modi, NDA Govt, Rahul Gandhi about National Herald Case

Congress vice-president Rahul Gandhi on Wednesday reiterated his charge that the National Herald case is "political vendetta coming out of the PMO" but said that he has full faith in the judiciary. "This is 100 per cent political vendetta coming out of the Prime Minister's office," Rahul Gandhi told reporters outside Parliament. Rahul also rejected the charge that Congress was using Parliament to threaten judiciary, saying "it is the other way round".

నా మీద కక్ష సాధింపు: రాహుల్ గాంధీ

Posted: 12/09/2015 03:37 PM IST
Modi govt doing vendetta on us

నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వం వంద శాతం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచే కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. పార్లమెంట్ వెలుపల రాహుల్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టు నుంచి పార్లమెంట్‌కు చేరడంతో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. న్యాయ వ్యవస్థను ఎవరు అదుపులోకి తీసుకున్నారో అందరికీ తెలుసని రాహుల్ విమర్శించారు.

రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను కుదిసేస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసు మీద వారు మండిపడుతున్నారు. నిన్న సోనియాగాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తాను ఇందిరా గాంధీ కోడలినని.. దేనికీ భయపడడని వ్యాఖ్యానించారు. కాగా ఈ కేసులో తమ కుటుంబాన్ని మోదీ ప్రభుత్వం కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కూడా మోదీ మీద అంతెత్తున మండిపడ్డారు. పార్లమెంట్ లో తాము ప్రశ్నిస్తున్నందునే తమపై ఇలా కేసులతో వేధించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాగా రాహుల్ వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ స్పందించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తాము నిర్దోషులమని రుజువు చేసుకోవాలంటే కాంగ్రెస్ ఆధారాలతో రావాలని రూఢీ అన్నారు. ఆధారాలతో వస్తే సభలో చర్చిస్తామన్నారు. హెరాల్డ్ అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడే ధైర్యం రాహుల్‌కు లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles