Finally, A Thank You From Nitish Kumar For PM Modi's Bihar Package

Nitish kumar asks pm modi to deliver on package promise for bihar

modi nitish, narendra modi, nitish kumar, nitish kumar bihar, bihar news, patna news, bihar special package, india news

Nitish is coming to Delhi to attend the wedding reception of Union Finance Minister Arun Jaitley’s daughter on Wednesday. PM Modi is also expected to attend the function.

మోడీకి థ్యాంక్స్ చెప్పి.. ఆ విషయాన్ని గుర్తు చేసిన నితీశ్ కుమార్

Posted: 12/09/2015 01:14 PM IST
Nitish kumar asks pm modi to deliver on package promise for bihar

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సుమారు నెల రోజుల అనంతరం నితీశ్ కుమార్, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించినందుకు ఆయనకు 'థ్యాంక్స్' చెప్పారు. బీహార్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడిన నితీశ్ కుమార్.. బీహారుకు రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ, అదనంగా రూ. 40 వేల కోట్లను ప్రస్తుత ప్రాజెక్టులకు ఇస్తామని మోదీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పారదర్శకంగా, అవినీతి రహితంగా ఖర్చు చేస్తాం. ప్రధాని ప్రకటించిన నిధుల వ్యయంపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తాం" అని అన్నారు. నితీశ్ నోటి వెంట మోదీ ప్రకటించిన ప్యాకేజీ మాటలు, ఆయనకు కృతజ్ఞతలు రావడం ఇదే తొలిసారి. అయితే ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పిన నితీష్ ఆయను ఇరకాటంలోకి నెట్టాలని ప్రయత్నించారని రాజకీయ పండితులు అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడి ప్రజలకిచ్చిన రాష్ట్రస్థాయి గుర్తింపు తరహాలోనే బీహార్ ప్యాకేజీ కూడా అటెకెక్కకుండా ఇప్పటి నుంచే మోడీని.. నితీష్ టార్గెట్ చేశారని అంటున్నారు. ఎంత త్వరగా నిధులిస్తారని మోదీని ప్రశ్నించినట్టు అయిందని వారు వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM modi  Nitish kumar  Bihar  Thank you  package  

Other Articles