TN floods: Former Congress union minister V Narayanasamy holds slippers for Rahul Gandhi?

Former union minister holds slippers for rahul gandhi in flooded puducherry

Rahul Gandhi,V Narayanasamy,Rahul Gandhi Puducherry,Chennai floods,Puducherry floods,Chennai rainsPuducherryTamil NaduRahul Gandhi slippers,Congress

As Rahul Gandhi toured flood-hit Puducherry on Tuesday, the man who held a pair of slippers for him to wear was V Narayanasamy, Congress lawmaker and once a union minister attached to the Prime Minister's Office.

ITEMVIDEOS: సత్యం సమాధి.. నెట్ జనుల వెర్రి.. రాహుల్ చెప్పులు మోసిన కేంద్రమంత్రి..? ఏది నిజం.?

Posted: 12/09/2015 12:36 PM IST
Former union minister holds slippers for rahul gandhi in flooded puducherry

సామాజిక మాద్యమం అందుబాటులోకి వచ్చిన తరువాత వాటి వల్ల అనేక సందర్బాల్లో మంచి జరుగుతున్నా.. పలు సందర్భాల్లో మాత్రం అంతకన్నా అధికంగా అతిగా దుష్ర్పచారం జరుగుతోంది. ఎవరో ఒకరు తొందరలో చేసిన పోస్టింగ్ పై కామెంట్లు, లైక్ లతో నెట్ జనులు స్పందనలు త్వరగానే చేరుకుంటున్నాయి. ఈ ధశలో అసలు ఎదుటి వారు పోస్ట్ చేసిన విషయం నిజమా..? అబద్దమా అని కూడా నిర్థారించుకోకుండా తమ స్పందనలు తెలియజేసి ఆనక చేతులు కాల్చుకుంటున్నారు. అసలు నిజం ఏమిటన్నది పక్కన బెడితే.. ఈ తొందరపాటు చర్యల వల్ల పలుమార్లు సత్యం సమాధి అవుతుంది. దుష్ప్రచారమే రాజ్యమేలుతుంది. మంచి చేయబోయి కొందరు అబాసుపాలవుతున్నారు. అయినా నెల్ జనులు మాత్రం ఇంకా తమ పంథాను మార్చుకోవడం లేదు.

హైదరాబాద్ లోని హైటెక్ సిటీ వద్ద ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కారు ప్రమాదానికి గురైన సందర్భంలో ఆయనకు సాయం చేయాల్సిన మనుషులు కనబడలేదు. కానీ ఆ వీడియోలను, ఫోటోలను తీసిన సోషల్ మీడియాలో క్షణంలో అప్ లోడ్ చేసిన నెట్ జనులు మాత్రం అనేక మంది కనబడ్డారు. దీనిపై ప్రకాష్ రాజ్ బాహాటంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల చైన్న వరద బీభత్సాన్ని ప్రధాని మంత్రి ఏరియల్ సర్వే ద్వారా వీక్షించగా, దానిని ఫోటో షాప్ లో కొత్త అర్థాలు వచ్చేలా నెట్ జనులు ఫోటోలను అప్ లోడ్ చేశారు. ప్రధాని అసలు ఏరియల్ సర్వే చేశాడా..? లేదా..? అనే అనుమానాలు కల్పించేలా చేశారు.

తాజాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత పుదుచ్చేరి ఎంపీ వీ నారాయణస్వామితో చెప్పులు మోయించుకున్నారన్న విషయమై నెట్ జనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు నిజం ఏమిటన్నది నారాయణ స్వామి చెప్పినా.. నెట్ జనుల చెవికి ఎక్కడం లేదంటే.. వారెంత దారుణంగా వ్యవహరిస్తున్నారో కూడా తెలియకుండా పోతోంది. తమిళనాడు, పుద్దుచ్చేరిలలో కురిసిన భారీ వర్షం. వరద ప్రభావిత ప్రాంతాలను రాహుల్ పర్యటించారు. మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో, నారాయణ స్వామి చెప్పులు పట్టుకుని వాటిని రాహుల్ కాళ్ల ముందు పెట్టగా, ఆయన వాటిని వేసుకుని నడుస్తూ వెళ్లినట్టు కనిపిస్తోంది.

కాగా, ఈ ఘటనను నారాయణస్వామి ఖండించారు. ఆయన బూట్లు వేసుకు వచ్చారని, వాటిని తొలగించి నీటిలో నడవడానికి ఇబ్బంది పడుతుంటే, తన చెప్పులు ఇచ్చానని, ఆయనపై గౌరవంతోనే అలా చేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చెప్పులు మోసే సంస్కృతి లేదని నారాయణస్వామి అన్నారు. తన షూస్ ను ఆయనే పట్టుకు నడిచారని, కనీసం సెక్యూరిటీ గార్డులకు కూడా ఇవ్వలేదని వివరించారు. అయినా నెట్ జనులు నారాయణ స్వామి మాటలను పట్టించుకోవడం లేదు..  రాహల్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి.. అక్కడ విద్యార్థులను కలసినప్పుడు తీసిన ఫోటోలో రాహుల్ వేసుకున్నది చెప్పులు కాదు షూస్ అని అర్థమవుతున్నా.. కావాలని లేని రాద్దాంతాన్ని చేస్తున్నారు నెట్ జనులు. ఇప్పటికైనా సత్యాన్ని సమాధి చేయకుండా.. ముందు యధార్థాలను తెలుసుకోండి..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : V Narayanasamy  Rahul Gandhi  Congress  Chennai floods  

Other Articles