Revanth Reddy said he dont invite KCR on his Daughter Marriage

Revanth reddy said he dont invite kcr on his daughter marriage

Revanth Reddy, KCR, Revanth Reddy Daughter, Chandrababu Naidu, Amaravati,Revanth Reddy Vs KCR

TDP Working President Revanth Reddy said that he dont invite KCR on his Daughter Marriage. Revanth Reddys daughters marriage on this month 20th.

కేసీఆర్ ను తన కూతురి పెళ్లికి పిలవడట..!

Posted: 12/08/2015 11:18 AM IST
Revanth reddy said he dont invite kcr on his daughter marriage

తన కుమార్తె వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానించేది లేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ తనకు శత్రువేనని… ఒక శత్రువుని మన ఇంట్లో శుభకార్యానికి ఎలా పిలుస్తాం అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. అయితే కేబినేట్ లోని తనకు సన్నిహితంగా ఉన్న మంత్రులను, నేతలను ఆహ్వానిస్తానని..వారు వచ్చేది లేదని వారి ఇష్టమని తెలిపారు. రేవంత్ కుమార్తె నైమిష వివాహం భీమవరంనకు చెందిన సత్యారెడ్డితో ఈ నెల 20న సాయంత్రం 8గంటలకు మాదాపూర్ హైటెక్స్ లో జరగనుంది.

Also Read: జాతీయ పార్టీ బంఫర్ ఆఫర్ చేజార్చుకున్న రేవంత్ రెడ్డి..!

అయితే రేవంత్ రెడ్డికి పాపం కోపం ఉంటే ఉండోచ్చు కానీ పద్దతి అంటూ ఒకటి ఉంటుంది.. కదా కనీసం దాన్ని పాటించాలి కదా. అంతెందుకు రేవంత్ రెడ్డి వాళ్ల నాయకుడు చంద్రబాబు నాయుడు నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కేసీఆర్ చంద్రబాబును తిట్టకూడని తిట్టన్నీ తిట్టేశాడు.. అలాగని చంద్రబాబు నాయుడు అమరావతి శంకుస్థాపనకు పిలవకుండా ఉండలేదు. అలాగే కేసీఆర్ కూడా అమరావతి శంకుస్థాపనకు వెళ్లకుండా ఉండలేదు. మరి తమ నాయకుడు అలా ఉంటే.. ఇంట్లో పెళ్లికి కేసీఆర్ ను పిలవను అని రేవంత్ రెడ్డి అనడం ఏంటని విమర్శించే వాళ్లున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  KCR  Revanth Reddy Daughter  Chandrababu Naidu  Amaravati  Revanth Reddy Vs KCR  

Other Articles