Haryana train mishap: Lokmanya Tilak Express collides with EMU near Palwal

Two trains collide in haryana 1 dead 100 injured

Lokmanya Tilak Express, EMU train, Dense fog, Train accident, Palwal (Haryana), train train collision, MumbaiHaridwar, Haryana, CPRO Neeraj Sharma, haryana train mishap, Railways, Car train collision,Jharkhand,Ramgarh,Unmanned railway crossing,Railway crossing,Howrah Bhopal Express,Bhurkhunda railway station,Patratu police station

Lokmanya Tilak Express collided with an EMU train in Palwal (Haryana) on Tuesday morning, reportedly killing one and injuring 100 people.

రెండు వేర్వేరు రైలు ప్రమాదాల్లో 14 మంది మృతి

Posted: 12/08/2015 11:02 AM IST
Two trains collide in haryana 1 dead 100 injured

హర్యానాలోని పల్వల్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పలువురు మరణించినట్టు తెలుస్తోంది. దాదార్ నుంచి అమృతసర్ వెళ్తున్న ఎక్స్ ప్రెస్ ను వెనుక నుంచి వేగంగా వస్తున్న ఈఎంయూ షటిల్ ఢీకొనగా, ఈఎంయూ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ఈఎంయూ షటిల్ అసోటి నుంచి పల్వాల్ వస్తోంది. ముందు వెళుతున్న రైలు నెమ్మదిగా నడుస్తోందని, వెనుక నుంచి వచ్చిన ఈఎంయూ దాన్ని బలంగా తాకిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడ పరిస్థితి బీతావహంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు మరణించారని, ఎంతమంది మరణించారన్న విషయం ఇప్పటికిప్పుడు నిర్థారించలేమని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు.

కాగా మరో ఘటనలో 13 మంది మృతి చెందారు. కాపాలా లేని రైల్వే గేటు వద్ద రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా ముందుకు వెళ్లిన కారును రైలు ఢీ కోనింది. ఈ ఘటనలో 13 మంది అసువులు బాసారు. వీరిలో ఆరుగురు పిల్లలు వుండగా, మిగిలిన వారంతా పెద్దలే. ఈ ఘటన జార్ఖండ్ లోని రాంఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లికి హాజరై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ కారు కాపాలా లేని రైల్వే క్రాసింగ్ దాటుతున్న సమయంలో అదే ట్రాక్ పై వస్తున్న హౌరా భూపాల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కోనడంతో ప్రమాదం సంభవించింది. బూర్ఖుందా రైల్వే స్టేషన్ సమీపంలో జరగడంతో ప్రమాదం జరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్గానికి పంపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Train collision  Lokmanya Tilak Express  EMU train  Dense fog  jharkhand  13 dead  

Other Articles