sewerage employee cacthes 4 years old kid falling from fourth floor

Mahesh turns real hero saving kids life

mahesh, bhargavi, sarojamma, mahesh turns real hero, sewerage employee turns real hero, sewerage employee saves 4 years old kid life, gauribidanur, kolar districe, Chikballapur district, mahesh saves bhargavi life, national collage gauribidanur, private finance,

sewerage employee mahesh turns real hero as he cacthes 4 years old kid falling from fourth floor and saves her life

4ఏళ్ల చిన్నారిని క్యాచ్ పట్టుకున్న రియల్ హీరో..

Posted: 12/07/2015 07:24 PM IST
Mahesh turns real hero saving kids life

నాలుగు అంతస్తుల భవనం నుంచి పొరపాటున నాలుగేళ్ళ చిన్నారి కిందపడిపోతుండడాన్ని చూసిన పైప్‌లైన్ రిపేరీ చేసే పౌరకార్మికుడు మహేష్‌ రియల్‌ హీరో అయ్యారు. క్షణం ఆలస్యం చేసి ఉంటే అందరూ చూస్తుండగానే నాలుగేళ్ళ చిన్నారి భార్గవి విగతజీవి అయిండేది. గౌరిబిదనూరులో ఆదివారం చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. నేషనల్‌ కాలేజ్‌ ముందు భాగాన ఉండే ప్రైవేట్‌ ఫైనాన్స్ కు గౌరిబిదనూరు తాలూకా మంచేనహళ్ళికి చెందిన సరోజమ్మ, నాలుగేళ్ళ మనవరాలు భార్గవితోపాటు వచ్చారు.

సరోజమ్మ నగదు లావాదేవీలలో ఉండగా భార్గవి రెండో అంతస్తునుంచి ఆట్లాడుకుంటూ నాల్గవ అంతస్తుకు చేరుకుంది. అక్కడినుంచి గ్రిల్‌లో తొంగి చూసి ముందుకు వచ్చింది. అంతలోనే గౌను గ్రిల్‌ కమ్మీకు తగులుకుని వేలాడుతుండడాన్ని అక్కడి దుకాణదారులు గమనించారు. అందరూ ఒక్కసారిగా కేకలు వేశారు. పౌర కార్మికుడు మహేష్‌ అక్కడే పైప్‌లైన్ రిపేరీ చేస్తూ ఒక్కసారిగా పైకి చూశాడు. అంతలోనే చిన్నారి కిందకు జారిపోయింది. ఒక్కసారిగా పరుగుదీసి చిన్నారి భార్గవిని మహేశ్ క్యాచ్ పట్టాడు.

ఒక్కసారిగా చిన్నారి ఏం జరిగిందోనని గాభరాపడింది. చిన్నారి క్షేమమని తెలిశాక అక్కడివారంతా వచ్చి మహేశ్‌ను రియల్‌ హీరో అంటూ కొనియాడారు. పైఅంతస్తు నుంచి రోదిస్తూ వచ్చిన అవ్వ సరోజమ్మ, చిన్నారిని ముద్దాడి మహేష్‌ చేతులు పట్టుకుని నా బిడ్డను బతికించావంటూ సంతోషం వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న గౌరిబిదనూరు పురసభ ముఖ్యాధికారి హనుమంతేగౌడతోపాటు పలువురు సిబ్బంది మహేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విషయం గౌరిబిదనూరులో చర్చనీయాంశమైంది. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్‌, స్థానిక ఎమ్మెల్యే శివశంకర్‌రెడ్డి, మహేష్‌ ధైర్యాన్ని చాకచక్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh  bhargavi  sarojamma  national collage  private finance  gauribidanur  

Other Articles