Minister Jarkiholi spends night at graveyard to denounce superstition

Fighting superstition from the graveyard

Minister Jarkiholi's spend night at graveyard to denounce superstition, death anniversary, father of Indian Constitution, B R Ambedkar, Anti Superstitions Reformation Day, Satish Jarkihol, Satish Jarkihol superstition, Satish Jarkihol grave yard, Satish Jarkihol supper, Satish Jarkihol sleep

State minister for small scale industries, Satish Jarkiholi, led a team of people to the graveyard here and spent the entire Saturday night there.

సశ్మానంలో మంత్రి బోజనం.. నిద్ర.. మూడనమ్మకాలు లేవని చాటేందుకేనట..

Posted: 12/07/2015 07:11 PM IST
Fighting superstition from the graveyard

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వినూత్నరీతిలో ప్రజలలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్న రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ జార్కిహొళి మరో భారీ కార్యక్రమాన్ని అమలు చేశారు. బెళగావి నగరం సదాశివనగర్‌ స్మశానవాటికలో సామూహిక భోజనం ఏర్పాటు చేశారు. అంతకుముందు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సతీష్జార్కిహొళి అధ్యక్షత వహించగా సాణేహళ్ళి పండితారాధ్య స్వామి, నిజగుణానంద స్వామి, ప్రముఖ సాహితీ విమర్శకులు హులికల్‌ నటరాజ్‌, డాక్టర్‌ హెచ్.ఎస్.అనుపమలు ముఖ్యులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సతీష్జార్కిహొళి మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలతో జనం ఇప్పటికీ వెనుకబడిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. స్మశానమైనా నగర నడిబొడ్డు అయినా ఒక్కటే అన్నారు. మూఢ నమ్మకాలను వీడేలా తన వంతు కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానన్నారు. స్వామిజీలు మాట్లాడుతూ సమాజం సాంకేతికమైన అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో మూఢనమ్మకాలను వీడాలన్నారు. భక్తి వేరు, మూఢనమ్మకం వేరన్నారు. అనంతరం జరిగిన సామూహిక విందులో 20వేలమందికిపైగా పాల్గొన్నారు. పంజాబ్‌, హర్యానా, మరాఠీలు పాల్గొనడం ప్రత్యేకం. ఇదిలా ఉండగా చిక్కబళ్ళాపుర జిల్లా తిప్పేనహళ్ళిలో దళిత సంఘర్ష సమితి స్మశానంలో ప్రత్యేక సమావేశాన్ని జరిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Satish Jarkihol  superstition  grave yard  supper  sleep  

Other Articles