Sexual harassment rife in medical profession, senior surgeon Dr Gabrielle McMullin says

Australian senior surgeon attacked for remarks on sexual harassment

Gabrielle McMullin, medicine, women, sexual harassment, Australia news, Medicine, Doctors, Women, Sex, Law, World news, Equality,

A senior surgeon says for women to protect their surgical careers, "complying with requests" for sex from male colleagues is a safer option than reporting the harassment.

కెరీర్ లో ఎదగాలంటే.. ఇక్కడి సీనియర్లతో ‘ఆ’ పని చేయక తప్పదు

Posted: 12/05/2015 06:30 PM IST
Australian senior surgeon attacked for remarks on sexual harassment

ఎంతో కష్టపడి చదవి.. జీవితంలో ఒక స్థాయికి చేరిన తరువాత.. అక్కడి నుంచే కెరీర్ ప్రారంభమవుతుంది. వైద్య రంగాన్ని కెరీర్ గా ఎంచుకునే యువతులకు ఇదే నా వినతి.. విలువైన కెరీర్ ను నాశనం చేసుకోవడం కంటే..  అంటే తమపై జరిగే లైంగిక వేధింపులపై అరిచి అందరికీ చెప్పడం కంటే బ్లో జాబ్‌ చేయడమే ఉత్తమం’... ఇదీ నా అభిప్రాయమని ఆస్ర్టేలియాకు చెందిన ఓ ఫిమేల్‌ సర్జన్‌ తన మనోగతాన్ని తన పుస్తక అవిష్కరాణ కార్యక్రమంలో బయటపెట్టింది.

శరీర భాగాల మీద, వాటి పనితీరు మీత పూర్తి అవగాహన ఉండే వైద్య రంగంలోనే లైంగిక వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో ఆమె చెప్పేది వింటే తెలిసిపోతుంది. శృంగార చర్యలకు అంగీకరించకపోవడం వల్ల కరోలిన్‌ అనే మహిళా సర్జన్‌ కెరీర్‌ అర్థాంతరంగా ఎలా ముగిసిపోయిందో డాక్టర్‌ గాబ్రియేల్‌ మెక్‌మిలన్‌ మీడియాకు వివరించారు. ‘కరోలిన్‌ అప్పుడే శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి ప్రవేశించింది. అప్పటికే అక్కడ ఉన్న ఓ సీనియర్‌ సర్జన్‌ ఆమెను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు.

అమె రహస్య భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. సెక్స్‌కు అంగీకరించాలని అడిగేవాడు. దాంతో బయపడిన ఆమె అతని గురించి కంప్లైంట్‌ చేసింది. ఇక అప్పట్నుంచీ ఆమెకు నరకం కనిపించింది. ఆమె ఎంత కష్టపడి పనిచేసినా అతను కరోలిన్‌ గురించి నెగిటివ్‌ రిపోర్టులు ఇచ్చేవాడు. ఇక ఆ బాధ తట్టుకోలేక ఆమె ఉద్యోగం కూడా మానేసింద’ని గాబ్రియేల్‌ తెలిపారు. ఆ కంప్లైంట్‌ స్వీకరించిన పెద్దలు కనీసం విచారణ కూడా చేయలేదని, తాను రాజీనామా చేసినా సీరియస్‌గా తీసుకోలేదని ఆమె ఆరోపించింది. అందుకే అరిచి గోల పెట్టడం కంటే సీనియర్ల కామవాంఛకు తల వంచడమే ఇక్కడ తప్పని సరి అయిందని ఆమె వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gabrielle McMullin  medicine  women  sexual harassment  

Other Articles