Man cannot divorce wife under Hindu law if she is terminally ill, rules Indian court

Ailing women cannot seek divorce to get money sc

Women,Supreme Court,Sadanand Gowda,Maneka Gandhi,Law Minister,juvenile,Cancer, India, court, hindu marriage act, medical treatment, sickness and in health, medicine, Indian court, wife, husband, marriage, India,News

India's top court makes landmark ruling amid fears husband pressuring wife who has breast cancer to accept settlement to pay for medical treatment

భార్య అంగకరించినా.. విడాకులుకు నో అన్న సుప్రీం..

Posted: 12/05/2015 01:27 PM IST
Ailing women cannot seek divorce to get money sc

హిందూ వివాహ చట్టం కింద పెళ్లాడిన పురుషుడికి తన భార్య కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రాథమిక విధి ఉంటుందనీ సుప్రీంకోర్టు పేర్కొంది. అనారోగ్యంపాలైన భార్యకు విడాకుల సెటిల్‌మెంట్‌ కింద పరిహారం ఇవ్వజూపడం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంవై ఇక్బాల్‌, జస్టిస్‌ సీ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ దాఖలు చేసిన విడాకుల కేసులో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

విడాకులు మంజూరుకు ముందే భర్తకు తన భార్యను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీరు 2010 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోగా, మూడేళ్లకే గొడవలు వచ్చి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల శాశ్వత సెటిల్‌మెంట్‌ కింద మొత్తం రూ. 12.5 లక్షలు చెల్లించేందుకు భర్త సిద్ధపడగా, దానికి ఆమె అంగీకరించింది. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో ఈ ప్రతిపాదన చేసినప్పటికీ ధర్మాసనం దీనికి సమ్మతించలేదు.

రొమ్ము కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధితో పిటిషనర్‌ బాధపడుతున్న దానికి వైద్యం కోసం ఆమె భర్తతో సెటిల్‌మెంట్‌కు వచ్చారని భావించిన ధర్మాసనం వారికి విడాకులు మంజూరు చేయడానికి తిరస్కరించింది. ఈ కేసును హైదరాబాద్‌ కుటుంబ న్యాయస్థానానికి బదిలీ చేసింది. అంతేకాకుండా భర్త పరిహారం కింద ఇవ్వజూపిన రూ.12.5 లక్షల్లో రూ. 5 లక్షలు తక్షణమే ఆమెకు చెల్లించాలని ఆదేశించింది. భార్యకు వ్యాధి నయమైన తర్వాత కుటుంబ న్యాయస్థానం అప్పుడు విడాకుల కేసును పునఃప్రారంభిం చాలని ధర్మాసనం ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Women  Supreme Court  Sadanand Gowda  Cancer  

Other Articles