Ram Mandir Construction Can 'Boost' PM Modis Popularity

Ram mandir construction can boost pm modis popularity

Modi, Shiva sena, Modi govt, Ram mandir, Ayodhya, Ram Temple, Bhagawath, RSS, NDA, Shivasena on Rammandir

Welcoming the assertion made by Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat over the Ram Mandir issue, the Shiv Sena on Saturday said that the popularity of Prime Minister Narendra Modi will increase by many folds as soon as he takes the responsibility of its construction into his own hands.

రామమందిరం నిర్మాణం... అదొక్కటే మార్గం..!

Posted: 12/05/2015 06:20 PM IST
Ram mandir construction can boost pm modis popularity

శివసేన మరోసారి తేనెతుట్టేను కదుపుతోంది. అయోద్యలో రామమందిర నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రామాలయం నిర్మించకుండా ఎందుకు జాప్యం  చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్మాణ పనులమొదలుపెట్టే తేదీని ప్రకటించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌కు అడుగుతోంది. రామాలయం నిర్మిస్తే మోడీ ఇమేజ్‌ అమాంతం పెరుగుతుందని శివసేన అంటోంది.  శివసేన అధికారిక పత్రిక సామ్నా ఎడిటోరియల్‌ కలకలం రేపుతోంది. రామమందిర నిర్మాణం చేపట్టేందుకు  తేదీ ప్రకటించాలని ఆర్‌ఎస్ఎస్‌ ఛీప్‌ మోహన్‌ భగవత్‌నే ఉద్దేశించి ఎడిటోరియల్‌ రాసింది. అయోద్య రామమందిరం విషయంలో ఇంకా జాప్యం చేయడం తగదని శివసేన అంటోంది. రోజులు గడిచిన కొద్దీ  అయోధ్య వివాదం పక్కకు పోతుందన్నారు. చివరకు ఆలయ నిర్మాణం జరగకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదే జరిగితే అయోద్య రామమందిరం కోసం ప్రాణాలు అర్పించిన వందల మంది త్యాగాలకు అర్ధం ఏముంటుందని ప్రశ్నిస్తోంది.

రామమందిరం నిర్మాణం చేపట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధైర్యంగా ముందుకు వస్తే ఆయన ఇమేజ్‌ పెరుగుతుందంటూ శివసేనలంటున్నాయి. రామమందిరం తప్పక నిర్మించాల్సిందే.. అది ఇప్పడే జరగాలి లేదంటే ఎప్పటికీ సాద్యం కాదంటోంది బీజేపీ మిత్రపక్షం శివసేన. హిందువుల కోరుకుంటున్న ఏకైక లక్ష్యమన్నారు. మన కళ్లతోనే అయోద్యలో రామమందిరం నిర్మాణం చూస్తామని.. త్వరలోనే సాకారం అవుతుందని ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ మోహన్‌ భగవత్‌ అన్నారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న లక్ష్యం చేరుకునే రోజులు వచ్చాయంటూ భగవత్‌ చేసిన వ్యాఖ్యలతో అయోద్య మందిర వివాదం తెరమీదకు వచ్చింది. బ్లాక్‌ డేకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపుతున్నాయి. దీనికి  శివసేన ఎడిటోరియల్‌ అగ్గికి ఆజ్యం పోసినట్టైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Shiva sena  Modi govt  Ram mandir  Ayodhya  Ram Temple  Bhagawath  RSS  NDA  Shivasena on Rammandir  

Other Articles