At least 14 people dead in California

At least 14 people dead in california

california, America, shooting in california, Obama, Syed Farook

One of the suspects in a mass shooting that left at least 14 people dead in California has been identified as a man named Syed Farook, US media reported on Thursday.Public records show that a man bearing the same name worked as an environmental health specialist for San Bernardino County, where the shooting took place.The Los Angeles Times said that two law enforcement sources had given the suspect's name as Syed Farook.

ITEMVIDEOS: కాలిఫోర్నియాలో కాల్పులు.. 14 మంది మృతి

Posted: 12/03/2015 11:36 AM IST
At least 14 people dead in california

కాల్పుల మోతలు మరోసారి అమెరికా మరోసారి వణికింది. ప్యారిస్ మీద దాడి ఘటన తర్వాత అమెరికాలో చోటుచేసుకుంటున్న దాడులు అక్కడి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యం మీద దాడులకు దిగుతామని ఉగ్రవాద సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో అక్కడి భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది అయినా కానీ గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగిస్తున్నారు. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ బెర్నార్డినోలో ముష్కరులు రెచ్చిపోయారు. రద్దీ ప్రాంతంలో సాయుధ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా బుల్లెట్ గాయాలయ్యాయి. శాన్ బెర్నార్డినోలోని ఇన్ లాండ్ రీజినల్ సెంటర్ సమీపంలోని సౌత్ వాటర్ మన్ అవెన్యూ, పార్క్ సెంటర్ లో దుండగుడు కాల్పులు జరిపినట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఒకరే కాకుండా ముగ్గురు పాల్గొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Also Read: వాళ్లంటే ఐఎస్ఐఎస్ కు హడల్ 

ముష్కరుడి కాల్పులతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సాయుధుడికి బెదిరింపులతో జనాలు చేతులెత్తి నిల్చుండిపోయారు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దుండగుడి కోసం గాలిస్తూనే... సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు హతం కాగా మరో ఇద్దరు దుండగులు సమీపంలోని భవనాల్లో దాక్కున్నట్లు సమాచారం.

Also Read: AK47 ఎక్కుపెట్టినా.. ఆ మహిళ బతికిపోయింది! 

కాగా దాడులకు పాల్పడింది సయీద్ ఫరూక్ అనే వ్యక్తిగా అక్కడి భద్రతా బలగాలు గుర్తించాయి. కాగా దాడులకు పాల్పడింది ఒక్కరు మాత్రమే కాదు అని.. కనీసం ముగ్గురు కలిసి దాడులకు తెగించినట్లుగా భద్రతా బలగాలు బావించాయి. అందులో ఇద్దరిని హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఆరా తీశారు. గత నెల 27న ఇదే రాష్ట్రంలోని కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో పోలీస్ అధికారి సహా ముగ్గురు చనిపోయారు. అంతకు నాలుగు రోజుల మందు న్యూ ఓర్లియాన్స్ నగరంలోని ఓ పార్కులో ఇరువర్గాలకు జరిగిన కాల్పుల్లో 10 మంది చనిపోయారు. తాజా ఘటనతో 15 రోజుల్లోనే మూడు మారణహోమాలు జరిగినట్లయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : california  America  shooting in california  Obama  Syed Farook  

Other Articles