గడిచిన 48 గంటల వ్యవధి నుంచి మావోల చెర వున్న టీఆర్ఎస్ నేతలు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు. శనివారం తెల్లవారుజామున చర్ల అటవీ ప్రాంతంలో ఆరుగురు టీఆర్ఎస్ నేతలను మావోలు వదిలేశారు. రెండు రోజుల క్రితం భద్రాచలం టీఆర్ఎస్ ఇన్చార్జ్ రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, పంతమూరు సురేష్, రెప్పకట్ల జానర్దన్, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను మావోలు అపహరించుకు వెళ్లారు. నకీలీ ఎన్ కౌంటర్లను నిలిపివేయాలని, అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కూంబింగ్ ను అపి వేయాలని డిమాండ్ చేస్తూ ఈ కిడ్నాప్ నేపథ్యంలో మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ కూడా విడుదల చేశారు.
బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం నేడు నెత్తుటి తెలంగాణను చేశారని, తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని మావోయిస్టులు మండిపడ్డారు. ప్రభుత్వానికి కనువిప్పు చేయడానికే నేతలను కిడ్నాప్ చేసినట్లు మావోయిస్టులు తెలిపారు. మావోలపై భౌతికదాడులకు పాల్పడితే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తామన్నారు. తమ డిమాండ్లను అంగీకరించకపోతే టీఆర్ఎస్ పార్టీ నేతలనే డిమాండ్ చేస్తామని లేఖలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అపహరణకు గురైన టీఆర్ఎస్ నేతల కుటుంబాల్లో తీవ్ర అందోళన నెలకొంది. తమ వారిని మావోలు ఎలాంటి హాని తలపెట్టకుండా క్షేమంగా వదిలివేయాలని కోరారు. అయితే వారి ప్రార్థనలు ఎట్టకేలకు ఫలించాయి. వారి మొరను ఆలకించిన మావోలు.. తమ చెరలో వున్న ఆరుగురు టీఆర్ఎస్ నేతలను ఇవాళ తెల్లవారుజామున వదిలిపెట్టారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more