gold prices hit their lowest in nearly six years

Gold price near six year low and outlook remains weak

Gold, prices, hit, lowest, six years, Gold, gold prices, commodities, silver, US Federal Reserve, dollar, investors, first US interest rate rise

Gold prices hit their lowest in nearly six years on Wednesday as the dollar rose and investors braced for the first US interest rate rise in nearly a decade next month.

అరేళ్ల కనిష్టస్థాయిలో వెలవెలబోతున్న పసిడి..!

Posted: 11/18/2015 08:34 PM IST
Gold price near six year low and outlook remains weak

కొంతకాలంగా స్థిరంగా ఉన్న  బంగారం విలువ దిగి వస్తోంది.  అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలర్   డిమాండ్  పుంజుకోవడంతో బంగారం దాదాపు ఆరు సంవత్సరాల దిగువకు పడిపోయింది.   అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు  ఈ డిసెంబర్లో పెరగనున్నాయనే వార్తల నేపథ్యంలో  10గ్రాముల బంగారం  ధర 25 వేలకు కొంచెం ఎగువన ట్రేడవుతోంది.  దీంతో  ఇన్వెస్టర్లలో ధరలు  మరింత దిగి వస్తాయనే కొత్త ఆశలు  చిగురించాయి.  రాబోయే కాలంలో పసిడి ధర 25  వేలకు  దిగి రావచ్చని  ఆశిస్తున్నారు.

పసిడితోపాటు ఇతర విలువైన మెటల్స్  రేట్లు కూడా దిగి వస్తున్నాయి. ముఖ్యంగా ప్లాటినం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.  బులియన్ మార్కెట్లో గత 10, 15  సెషన్లుగా క్షీణిస్తూ వస్తున్న పసిడి ధర బుధవారం 25  వేల మార్కు దగ్గర ట్రేడవుతోంది.  ఈ క్షీణత   కొనసాగితే , పుత్తడి ధర ఇంకా దిగి వచ్చే అవకాశాలున్నాయని ఎనలిస్టులు  సూచిస్తున్నారు. 2010 ఫిబ్రవరితో పోలిస్తే  ..బంగారం విలువ బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 25,117 స్థాయిని తాకింది.

క్రితం రోజు 450 రూపాయల పతనమైన బంగారం ధర.. ఇవాల కూడా పతనం అంచునే కోనసాగి మరింత నేల చూపులు  చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రిటైల్ మార్కెట్ లో ఆర్నమెంట్ బంగారం, నగలకు డిమాండ్   తగ్గుముఖం పట్టడం కూడా ఒక కారణమని ఎనలిస్టులు  భావిస్తున్నారు.  గత కొన్ని రోజులు పసిడి ధరలో క్షీణత గమనిస్తున్నప్పటికీ, ఈ పతనం  కీలకమైందంటున్నారు ట్రేడ పండితులు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  gold prices  commodities  silver  US Federal Reserve  

Other Articles