swachh bharat cess eating out travelling and phone calls

Swachh bharat cess will not get you a clean india

Swachh Bharat cess, mobile phone services, sur charges, phone bills, swachh bharat, swachh bharat cess, swachh bharat tax, swachh bharat service tax, swachh bharat cess implementation, swachh bharat abhiyan, india news, latest news

The Swachh Bharat cess goes against the logic of GST and fiscal federalism.

సెల్ ఫోన్ బిల్లులకు రెక్కలు.. పెరగనున్న చార్జీలు

Posted: 11/18/2015 07:23 PM IST
Swachh bharat cess will not get you a clean india

స్వచ్ఛభారత్ సెస్ వల్ల టెలిఫోన్ నుంచి రైలు ప్రయాణం వరకు, ఉప్పు నుంచి పప్పు వరకు, మంచినీళ్ల నుంచి మద్యం వరకు, రెస్టారెంట్లలో టిఫిన్ నుంచి భోజనం వరకు భారం కానున్నాయి. టెలిఫోన్ సర్వీసులపై ఇప్పటికే 14 శాతం సర్వీసు టాక్స్‌ను వసూలు చేస్తుండగా దానికి 0.5 శాతం ఈ కొత్త సెస్ వచ్చి చేరింది. అదేంటి సెల్ ఫోన్ బిల్లులను పెంచాలంటే సదరు కంపెనీ వారు పెంచాలి లేదా ట్రాయ్ పెంచాలి మరి సెస్సులతో పెంపు ఎక్కడిది అనుకుంటున్నారా..?

కేంద్ర ప్రభుత్వం స్వచ్చా భారత్ సెస్సును అమలోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం సర్వీస్ టాక్స్ వర్తించే అన్ని సేవలపై స్వచ్ఛ భారత్ సెస్‌ను వసూలు చేస్తారు. ప్రతి వెయ్యి రూపాయలకు 50 రూపాయల చొప్పున సెస్ పడుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఏసీ సౌకర్యంగల మెస్‌లు సరఫరా చేసే ఆహార పదార్థాలు, లిక్కర్, బ్రేవరీస్‌ల నుంచి పంపిణీ జరిగే మద్యంపై ఈ సెస్ విధిస్తారు. ఖరీదైన భవనాలకు, వివిధ పనుల కాంట్రాక్టులకు కూడా ఇది వర్తిస్తుంది. విమానయాన ట్రావెల్ ఏజెంట్లు, లాటరీ ఏజెంట్లు, లాటరీ డిస్ట్రిబ్యూటర్లు, జీవిత భీమా సంస్థలు అందించే సర్వీసులకు కూడా ఈ సెస్ వర్తిస్తుంది.

విదేశీ మారక ద్రవ్యం మార్పిడిలో కూడా సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పారిశ్రామిక రంగంపై కూడా ఆర్థిక భారం పడుతుంది. నవంబర్ 15వ తేదీకి ముందే ఇన్‌వాయిస్‌లు రూపొందించి సరకు సరఫరాకాని వారికి నవంబర్ 29 వరకు సెస్ మినహాయింపును ఇచ్చారు. ఆ తర్వాత సర్వీసు టాక్స్ పరిధిలోకి వచ్చే అన్ని లావాదేవీలపై సెస్ విధిస్తారు. 2006 నాటి సర్వీస్ టాక్స్ నిబంధనల ప్రకారమే సర్వీసు విలువను లెక్కేసే సెస్‌ను అంచనా వేస్తారు. ఈ సెస్ కింద వసూలయ్యే మొత్తాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తారు.

అయితే భారత దేశంలో మహానగరాలన్నీ చెత్తా చెదారంతో నిండివున్నా.. ఎక్కడా స్వచ్ఛా కనిపించకపోయినా.. సెస్సును వసూలు చేయడంపై మాత్రం ప్రజలు మండిపడుతున్నారు. దేశాన్ని అర్థకంగా పరుగులెత్లించడం కోసం మూలిగే నక్కపై తాటికయ పడినట్లు.. ఇప్పటికే నిత్యావస సరుకుల ధరలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలను మోడీ సర్కార్.. స్వచ్చా భారత్ పేరున మరింతగా ముక్కుపిండి వసూలు చేయడం సబబు కాదని అనేకులు అభిప్రాయపడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swachh Bharat cess  mobile phone services  sur charges  phone bills  

Other Articles