delhi gang maraud business persons in the name of marriage contacting by matrimony websites | delhi gang theft case

Delhi gang maraud business persons in the name of marriage

delhi gang crime news, jaheeda main accused, mahammad sajid crime news, delhi gang maraud family members, theft cases, maraud case, delhi gang marriage maraud

delhi gang maraud business persons in the name of marriage : delhi gang maraud business persons in the name of marriage contacting by matrimony websites.

పెళ్ళి చేసుకుంటామని.. బెదిరించి దోచేశారు!

Posted: 11/18/2015 10:54 AM IST
Delhi gang maraud business persons in the name of marriage

డబ్బులు చాలా సులువుగా సంపాదించడం కోసం ఓ గ్యాంగ్ చాలా ప్రత్యేకమైన విధానాన్నే ఎంచుకుంది. బాగా డబ్బున్న వ్యాపారులు, ఉన్నతుద్యోగులను టార్గెట్ చేసి.. మ్యాట్రిమోని సెట్లై ద్వారా వాళ్ళ కుమార్తెలతో పెళ్ళి సంబంధం పేరుతో వారింటికి ఆ గ్యాంగ్ బయలుదేరుతుంది. అప్పుడు వారింట్లో వున్న విలువైన వస్తువులు ఏవేం వున్నాయో, ఎక్కడున్నాయో అంతా చూసుకుంటారు. ఆ తర్వాత సంబంధం ఖాయం చేసుకోవడానికి వస్తున్నామంటూ.. తుపాకీతో వాళ్ళను బెదిరించి అంతా దోచేస్తుంటారు. ఈ విధంగా ఈ గ్యాంగ్ అరడజను వ్యాపారవేత్తలను దోచేసుకుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ గ్యాంగ్ మొత్తానికి లీడర్ 60 ఏళ్ల బామ్మ జహీదా. ఆమె పెళ్ళి కొడుకు బామ్మగా వచ్చి.. ఇల్లు మొత్తం బాగా చూసుకుంటుంది. అనంతరం తన గ్యాంగ్ సభ్యులకు ఆ ఇంట్లో వున్న విలువైన వస్తువుల గురించి సమాచారం అందిస్తుంది. ఆ తర్వాత ఆ గ్యాంగ్ ఆ ఇంటిపై దాడి చేసి, మొత్తం దోచేసుకుంటుంది.

ఈనెల 12వ తేదీన ఢిల్లీ ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో బాగా డబ్బున్న వ్యాపారిని టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్.. అతడిని దోచుకునేందుకు ప్లాన్ చేశారు. తొలుత మ్యాట్రిమోని సైట్ ద్వారా ఆ వ్యాపారిని సంప్రదించిన ఈ గ్యాంగ్.. తాము చాలా మంచోళ్ళమంటూ మాయమాటలతో నమ్మించింది. అనంతరం అతని కూతురితో సంబంధం కుదుర్చుకుంటామని ఆ గ్యాంగ్ చెప్పింది. దీంతో సరేనన్న ఆ వ్యాపారి.. వారితో పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి తన ఇంటికి పిలిపించాడు. దాంతో తాము వేసిన వలలో ఆ వ్యాపారి చిక్కుకున్నాడని భావించిన ఆ గ్యాంగ్.. మొదట పెళ్ళి చూపుల కోసమని బాగానే ముస్తాబయి వచ్చారు. ప్లాన్ ప్రకారం.. ఆ గ్యాంగులో ఒకడు పెళ్ళికొడుకుగా ముస్తాబు కాగా, అతనికి బామ్మగా జహీదా కూడా వచ్చింది. కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్న అనంతరం ఆ బామ్మ.. ఇళ్లు చూస్తానని చెప్పింది. ఆమె మాటను కాదనలేకపోయిన ఆ వ్యాపారి.. ఆ బామ్మకు ఇళ్లు మొత్తం చూపాడు. అనంతరం ఆ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆ గ్యాంగ్.. అతనిని దోచుకోవడానికి ప్లాన్ వేసుకున్నారు. ఇక ఆ గ్యాంగ్ పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి వస్తున్నామంటూ అతనిని దోచుకోవడానికి ఇంటికి చేరుకుంది. అయితే.. ఇంటికొచ్చినవారిలో దోపిడీదారులు కనిపించడంతో ఆ వ్యాపారి చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ గ్యాంగ్ సభ్యులు అరెస్ట్ చేయగా వారి బండారం మొత్తం బయటపడింది. ఆ గ్యాంగ్ ఇదివరకే ఆరుగురువ వ్యాపారవేత్తలను దోపిడీ చేసుకుందని తెలిసింది.

ఆ గ్యాంగులో కీలక పాత్రలు పోషించిన మీరట్‌కు చెందిన మహ్మద్ సాజిద్ (26), జహీదా (60)లను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వాళ్లు ఇంతవరకు దోచుకున్న మొత్తం నగలను స్వాధీనం చేసుకున్నామని, గ్యాంగులో ఇతర సభ్యుల కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. వీళ్లలో జహీదాకు మీరట్‌లో హార్బర్ నేరస్థులతో సంబంధాలు కూడా వున్నాయి. చాలా గ్యాంగులకు ఆమె సుపరిచితురాలు. ఆమె బయోడేటా తెలుసుకున్న అనంతరం పోలీసులే ఖంగుతిన్నారు. ఇక సాజిద్ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ సైడ్ బిజినెస్‌గా ఈ దోపిడీలు చేస్తున్నాడని తెలిసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi gang marriage maraud  matrimony websites  

Other Articles