prior to murder rekky was done in anuradha, mohan murder case

Rekky was done in anuradha murder

Chittoor crime news, chittoor mayor, anuradha, Chittoor mayor Anuradha, Chittoor mayor Murder, Chittoor Attack, chitoot recky, factionism, rayalaseema factionist murder

sources said that prior to murder of chitoot mayor anuradha, and her husband mohan rekky was done

రెక్కీ నిర్వహించి.. పక్కా పథకంతో అనురాధ దంపతుల హత్య..?

Posted: 11/17/2015 01:17 PM IST
Rekky was done in anuradha murder

చిత్తూరు మేయర్ అనురాధ దంపతులపై జరిగిన హత్య తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. సీమలో మరోమారు పాక్షన్ హత్యలు జరగడం సంచలనం రేపుతోంది. ప్రశాంతంగా వున్న రాష్ట్రంలో అనురాధ అమె భరత్ మోహన్ హత్యలతో పాక్షన్ రక్కసి మళ్లీ పడగ విప్పిందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కిరాయి హంతకులతో ప్రత్యర్ధులను మట్టుబెట్టే సంస్కృతికి.. నేటి రాజకీయాలు కనుమరుగైందని బావిస్తున్న తరుణంలో ఏకంగా మేయర్ హోదాలో వున్న అనురాధను, అమె భర్తను అత్యంత కిరాతకంగా హత్యమార్చిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. అనురాధ, మోహన్ లపై పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని స్థానికులు అరోపిస్తున్నారు.

కార్పొరేషన్ లో నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా మేయర్ కు పలువురు ఫిర్యాదులు, విజ్ఞాపన పత్రాలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఐదుగురు వ్యక్తులు మేయర్ కు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని వచ్చారు. వీరిలో నలుగురు బురఖాలు ధరించగా, మిగిలిన వారు మామూలుగానే కార్యాలయంలోకి ఎంటర్ అయ్యారు. మేయర్ ఛాంబర్ లోకి రాగానే వెంటనే తుపాకితో కాల్పులు జరిపారు. మోహన్ పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అనురాధ అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు.

Also read :  చిత్తూరు మేయర్ హత్య

మరోవైపు తుపాకుల మోత, కత్తులతో దాడి నేపథ్యంలో వినిపించిన హాహాకారాలతో కార్యాలయంలో ఉన్న ప్రజలు, సిబ్బంది షాక్ కు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో, తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. దాడి పూర్తయిన వెంటనే దుండగులంతా పారిపోయారు. అయితే మేయర్ అనురాధ, మోహన్ లను టార్గెట్ చేసుకున్న దుండగులు పక్కా ప్రణాళికతోనే హత్యకు పాల్పడి వుంటారని, అంతకుముందే పక్కాగా రెక్కీ నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి నెల రోజుల పాటు పక్కాగా ప్లాన్ చేసుకుని చేసిన హత్య అని పోలీసులు భావిస్తున్నారు. మేయర్ ఏ సమయానికి కార్పొరేషన్‌కు వస్తారో అన్నీ ముందుగానే చూసుకుని వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి నలుగురు వ్యక్తులు గ్రూపుగా వచ్చి ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Chittoor crime news  Chittoor mayor Anuradha  Murder  Chittoor Attack  

Other Articles