Attemp to murder on Chittoot Mayor

Attemp to murder on chittoot mayor

Chittoor, chittoor mayor, anuradha, Chittoor mayor Anuradha, Chittoor mayor Murder, Chittoor Attack

Unknown persons attacked on chittoor mayor Anuradha and her husband. Police filed a case on this incident. Chittor police sarching for accuses.

ITEMVIDEOS: చిత్తూరు మేయర్ హత్య

Posted: 11/17/2015 12:57 PM IST
Attemp to murder on chittoot mayor

చిత్తూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మేయర్ అనురాధ మీద గుర్తు తెలియని దుండగులు దాడికి దిగడంతో జిల్లాలో కలకలం రేగింది. అయితే మేయర్ కార్పోరేషన్ ఆవరణలో ఉండగానే బరఖా ధరించిన కొంత మంది దుండగులు కాల్పులు జరిపారని.. తర్వాత కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ ల మీద కసితో ఇలా దాడికి దిగినట్లు తెలుస్తోంది. కాగా అనురాధ అక్కడిక్కడే మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అనురాధ భర్త మోహన్ ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మోహన్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చిత్తూరు మేయర్ మీద.. అది కూడా కార్పోరేషన్ ఆవరణలోనే దాడికి దిగడం సంచలనం రేపుతోంది. కఠారి అనురాధ కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే సికె బాబు కు మధ్య అంతరాలు ఉన్నాయని.. ఆ తగాదాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే అనురాధ మీద దాడికి పాల్పడిన దుండగులు బురఖాలో వచ్చారని.. తమతో పాటు కత్తులు, తుపాకులు తెచ్చుకున్నారని తెలుస్తోంది. అనురాధ మీద రెండు రౌండ్ల కాల్పులు జరిపారని. తర్వాత కత్తులతో తీవ్రంగా గాయపర్చారని తెలుస్తోంది. దాడి ఘటన మీద పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles