Special cell cop kills self and wife attempts suicide

Special cell cop kills self and wife attempts suicide

Amith singh, suicide, ACP Amith Singh, Amith singh suicide in Noida, Delhi, Police, Amith Singh family

A Delhi police ACP working in the elite Special Cell allegedly committed suicide by shooting self with his service pistol at his flat in Sector 100 on Monday night. His wife also attempted suicide by jumping off from their flat situated on fourth floor of the building after his death.

ITEMVIDEOS: రివాల్వర్ తో కాల్చుకున్న ఏసీపీ

Posted: 11/17/2015 01:32 PM IST
Special cell cop kills self and wife attempts suicide

అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ స్థాయిలోని ఓ సీనియర్ పోలీసు అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో అతని భార్య నాలుగు అంతస్తుల అపార్ట్-మెంట్-లోని బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని నోయిడాలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్-లో అమిత్ సింగ్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ)గా ఉద్యోగం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం సరితను అమిత్ సింగ్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులిద్దరూ నోయిడాలో కాపురం ఉంటున్నారు. అమిత్ సింగ్, సరిత దంపతులకు 18 నెలల పాప కూడా ఉంది.

Also Read: నా శీలాన్ని దోచేసి వదిలేసింది.. న్యాయం చేయండి

అర్ధరాత్రి అమిత్ సింగ్ ఓ గదిలోకి వెళ్లి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని కుప్పకూలిపోయాడు. వేరే గదిలో ఉన్న సరిత వెళ్లి భర్తను చూసి గట్టిగా కేలు వేసింది. సెక్యూరిటీ గార్డులు, ఇరుగు పొరుగు వారు వచ్చి చూశారు. అయితే ఆందోళన చెందిన సరిత నాలుగవ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. ఈ సంఘటనపై అపార్ట్-మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అమిత్ సింగ్, సరితలను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అమిత్ సింగ్ మరణించారని వైద్యులు చెప్పారు. సరిత పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఇటీవలి కాలంలో అమిత్ సింగ్- సరిత దంపతులు నిత్యం గొడవపడేవారని అపార్ట్-మెంట్ వాసులు చెప్పారని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles