Rahul Gandhi Is A British Citizen

Rahul gandhi is a british citizen

Rahul gandhi, British citizen, India, Rahul, AICC, Congress, BJP, Subramanian Swamy, Subramanian Swamy on Rahul, Subramanian Swamy contraversial statements

Bhartiya Janata Party leader Subramanian Swamy has accused Congress Party Vice President Rahul Gandhi of being a British citizen, and demanded that he be stripped of his Indian citizenship and Lok Sabha membership. In a letter to Prime Minister Narendra Modi, Swamy has claimed that Gandhi declared his nationality as British when filing the returns of a company--Backops Ltd--he had incorporated in the UK in 2003.

రాహుల్ గాంధీ భారతీయుడు కాదట..!

Posted: 11/17/2015 08:21 AM IST
Rahul gandhi is a british citizen

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి, భవిష్యత్ లో పార్టీని దేశాన్ని నడిపిస్తారు అని ఎంతో మంది కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు భావిస్తుంటే.. అసలే రాహుల్ గాంధీ భారతీయుడే కాదు అని బాంబు పేల్చారు. రాహుల్ గాంధీ బ్రిటీష్ సిటిజన్ అని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. అతడి లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్వామి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీకి సుబ్రమణ్యస్వామి ఈ మేరకు ఓ లేఖ రాశారు. రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం ఉండడమే కాదు, లండన్ లో ఓ ప్రైవేటు కంపెనీని కూడా నడుపుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం రాహుల్ గాంధీ భారతీయ పౌరసత్వాన్ని, లోక్ సభ సభ్యత్వాన్ని కూడా రద్దుచేయాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. నవంబర్ 12న స్వామి ప్రధానికి రాసిన లేఖలో ఆ విషయాన్ని రుజువు చేసే కొన్ని పత్రాలను జతచేశారు. రాహుల్ గాంధీ 2003 ఆగస్టు21న ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో బ్యాక్ అప్స్ లిమిటెడ్ అనే కంపెనీని రిజిస్టర్ చేశారని, ఆ కంపెనీ డైరెక్టర్, సెక్రటరీ ప్రస్తుత లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీయేనని తెలిపే పత్రాలు జతచేశారు. త్వరలోనే ఈ విషయంలో తాను లోక్ సభ స్పీకర్ ను కూడా కలిసి లేఖ అందజేస్తానని తెలిపారు. అలాగే సభ్యుల నియమ నిబంధనావళి, మౌలిక ఆచరణ సూత్రాలకు సంబంధించిన కమిటీని కూడా కలిసి తగిన చర్య తీసుకోవాలని కోరనున్నట్లు సుబ్రమణ్యస్వామి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles