Heavy rains in several districts of AP

Heavy rains in several districts of ap

Heavy Rains, Rains, AP, Chandrababu, Chittoor, Kadapa, Nellore, Prakasam

Heavy rains triggered by the north east monsoon continued to lash several districts of Andhra Pradesh flooding low-lying areas and throwing normal life completely out of gear. The districts of Chittoor, Kadapa, Nellore and Prakasam received heavy rainfall in the last couple of days.

ఏపిలో వర్షం తెస్తోంది కష్టం

Posted: 11/17/2015 08:09 AM IST
Heavy rains in several districts of ap

వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో చిత్తూరులో జన జీవనం స్థంభించింది. ప్రకాశం, కడప జిల్లాలు జలమయమయ్యాయి. దీంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. వర్షాలు పడుతున్న జిల్లాల్లో సహాయక చర్యలకు మంత్రుల బృందాలను నియమించింది. ప్రత్యేకంగా హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. ఏపీలో వరుణుడు సృష్టిస్తున్న బీభత్సం ఇది. మొన్నటి వరకు వర్షాలు లేవని ఎదురుచూసిన ప్రజలను ఇప్పుడు అకాల వర్షాలు ఏడిపిస్తున్నాయి.. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. అటు చెన్నైలోనూ.. ఇటు చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కారణంగా ఇప్పటికే పలు రైళ్లు రద్దయ్యాయి. మరోవైపు ఏపీలో రవాణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కడప జిల్లాను అతలాకుతలం చేసింది. రెండు రోజులగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేటలోని నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.

నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో 25 చెరువులకు గండి ఏర్పడింది. నెల్లూరు పెన్నా బ్యారేజ్ దగ్గర నది ఉధృతంగా ప్రవాహిస్తోంది. వెంకటగిరిలో ప్లాట్ ఫారం విరిగి పట్టాలపై పడడంతో భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే అధికారులు నిలిపివేశారు. నెల్లూరు నీటి పారుదల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు నీటమునిగాయి. రైల్వేట్రాక్ పై నీళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలకు ఇవాళ సెలవు ప్రకటించారు. జిల్లాలో 28 చెరువులకు గండ్లు పడ్డాయి. వర్ష బీభత్సంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. అకాల వర్షాలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరిపింది. వర్షాలు పడుతున్న ఆయా జిల్లాలకు మంత్రుల బృందాలను ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లాలకు శిద్ధా రాఘవరావు, నారాయణ.. కడప జిల్లాకు గంటా శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లాకు మంత్రులు చిన రాజప్ప, బొజ్జల, పుల్లరావులను పంపాలని నిర్ణయించింది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heavy Rains  Rains  AP  Chandrababu  Chittoor  Kadapa  Nellore  Prakasam  

Other Articles