Revanth reddy slams KCR and said he is a Paagal

Revanth reddy slams kcr and said he is a paagal

Revanth Reddy, KCR, telangana, TTDP, TRS, Mental Hospital, Chest Hospital, Hyderabad

TTDP Working president revanth Reddy slams telangana cm KCR. He said that he is a Paagal and Deewana. KCR Behaving as a mental patient.

కేసీఆర్ ఓ పాగల్, దివానా

Posted: 11/17/2015 09:30 AM IST
Revanth reddy slams kcr and said he is a paagal

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి మాటల దాడికి దిగారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో రేవంత్ కేసీఆర్ మీద ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెడలు వంచితే గానీ తెలంగాణ బాగుపడదని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంతరెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఒక పాగల్‌, దివానా అని ఎద్దేవా చేశారు. ఎర్రగడ్డలో సెక్రెటేరియట్‌ కడతా అంటూ ఎన్నో మాటలు చెప్పి.. అరచేతిలో స్వర్గం చూపించిన సీఎం ఏ ఒక్క పనీ చే యలేదు. అన్ని మాటలు చెప్పిన సీఎంను పాగల్‌గాడు అనకపోతే ఇంకేమనాలి అని అన్నా రు. ఎవరైన ఊళ్ళో పిచ్చి పనులు చేస్తుంటే వాళ్లను ఎర్రగడ్డకు తీసుకుపొమ్మంటారు..ఈ రో జు సెక్రెటేరియట్‌ను ఎర్రగడ్డలో కడతాననన్న సీఎం అక్కడే ఆయన ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని రేవంత్ సలహా ఇచ్చారు.

వరంగల్ ఉప ఎన్నికల అవకాశాన్ని వాడుకొని కేసీఆర్‌కు కర్రుకాల్చి వాతపెడితే తప్ప రాష్ట్రం బాగుపడదు అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.  ఉపఎన్నికల్లో సునాయసంగా గెలుస్తామని అనుకున్న ఆ పార్టీ నేతలకు.. ఊళ్ళలోకి వెల్లగానే మహిళలు చెప్పులు, చీపుర్లు పట్టుకొని వస్తుండడంతో అక్కడున్న పరిస్థితి అర్థమైందన్నారు. డాక్టర్‌ రాజయ్య పట్టు పంచె కట్టుకొని దొరబాబులాగా కేబినెట్‌ సమావేశానికి హాజరైతే.. కన్నుకుట్టి ఆయన్ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్‌ తొలగించారన్నారు. ఆ విషయం తనకు రాజయ్య స్వయంగా చెప్పారని తెలిపారు. రాత్రింబవళ్లు ఆస్పత్రుల చుట్టూ తిరిగి రోగులకు వైద్యం అందేలా కృషి చేసిన డాక్టర్‌ రాజయ్య ను అవమానించాలనే బర్తరఫ్‌ చే శారన్నారు. ఎమ్మెల్యేలను సీఎం ఆయన పనివాళ్లు అనుకుంటున్నారని, మంత్రులను ఆయన సారాలో సోడా కలిపే సన్నాసులు అనుకుంటున్నాడని రేవంత్ ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  KCR  telangana  TTDP  TRS  Mental Hospital  Chest Hospital  Hyderabad  

Other Articles