Is KCR Ready to open debate

Is kcr ready to open debate

KCR, Kishan Reddy, telangana, Telangana Govt, open debate, Warangal

BJP Telangana President Kishan Reddy said that Is Telangana cm KCR ready to open debate. KCR promise many things in the elections but he failed tomake them true.

కేసీఆర్...బహిరంగ చర్చకు సిద్దమా..?

Posted: 11/11/2015 11:45 AM IST
Is kcr ready to open debate

ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలుచేశామని చెబుతున్న కెసిఆర్‌ వరంగల్‌ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. చర్చకు సిద్ధమైతే ప్రెస్‌క్లబ్‌ వేదికగా సమయాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ ఉప ఎన్నికలను టిఆర్‌ఎస్‌ ప్రజలపై అనవసరంగా రుద్దిందని విరుచుకుపడ్డారు. కెసిఆర్‌ అహంకారానికి వరంగల్‌ ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటకలో సిసిఐతో పాటు సహకార సంఘాలను ఏర్పాటు చేసి, మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లిస్తూ పత్తిని కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేశారు.

పత్తి రైతుల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నయా పైసా కూడా ఖర్చు చేయడం లేదని దుయ్యబట్టారు. ఫాంహౌస్‌కే పరిమితమైన కెసిఆర్‌ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు. దేవయ్య అభ్యర్థిత్వం విషయంలో మాట్లాడే అర్హత టిఆర్‌ఎస్‌కు లేదన్నారు. పార్టీ ఫిరాయింపుతో వచ్చిన వారికి పదవులు అంటగట్టే చరిత్ర ఉన్న టిఆర్‌ఎస్‌ 42 ఏండ్లు అమెరికాలో ఉన్నా అక్కడి పౌరసత్వం తీసుకోని దేవయ్య గురించి మాట్లాడుతారా? అంటూ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ... కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు అక్కడ కాలు పెట్టాలంటేనే భయపడుతుందని అన్నారు. చైతన్యవంతులైన ప్రజలు టిఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Kishan Reddy  telangana  Telangana Govt  open debate  Warangal  

Other Articles