cyber criminal madhu shocked police by asking reverse questions them in interrogation | madhu cyber criminal | madhu traps 300 girls

Cyber criminal madhu reverse interrogation to police in custody

cyber criminal madhu, cyber crime madhu, madhu trap 300 girls, madhu trap 39000 girls, madhu police interrogation, madhu reverse interrogation, women crime news

cyber criminal madhu reverse interrogation to police in custody : cyber criminal madhu shocked police by asking reverse questions them in interrogation.

పోలీసులనే రివర్స్ ఇంటరాగేట్ చేస్తున్న ‘కామాంధుడు’

Posted: 10/31/2015 10:34 AM IST
Cyber criminal madhu reverse interrogation to police in custody

టైటిల్ చదవడానికి కాస్త విచిత్రంగానూ, ఆశ్చర్యకరంగానూ వున్నా.. అది జరిగింది మాత్రం నిజం. ఇటీవల మహామాయగాడు అయిన ఓ కామాంధుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇంటరాగేషన్ సమయంలో అతడే పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇంతకీ ఆ కామాంధుడు ఎవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. ఏకంగా 39 వేలమంది అమ్మాయిల ఫోన్ నెంబర్లను ట్రాక్ చేసి, దాదాపు 300 మందిని వంచించి తన కామవాంఛను తీర్చుకున్న మధు. సాధారణంగా తమ కస్టడీలోకి తీసుకున్న నిందితుల్ని పోలీసులు ప్రశ్నిస్తారు కానీ.. మధు విషయంలో మాత్రం భిన్నంగా వుంది. నిందితుడే  పోలీసు అధికారులకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు.. అతడి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకున్నారట.

ఉద్యోగాల పేరిట యువతులను వంచన చేసిన మధును ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే! అతడి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన పోలీసులకు విస్తుగొలిపే ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు.. న్యాయస్థానం అనుమతితో నిందితుడ్ని నాలుగు రోజుల క్రితమే సీసీఎస్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం తొలిరెండు రోజుల విచారణ చేసిన పోలీసులకు అంతగా ఇబ్బందులేమీ ఎదుర్కోవాల్సి రాలేదు కానీ.. మూడోరోజు విచారణ సందర్భంగా మధు వారికి షాకిచ్చాడు. ఈ నేపథ్యంలోనే మధు నుంచి వీరికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓపక్క ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ముసుగులో, బంగారు భవితకు అవసరమైన సలహాలు ఇస్తానంటూ అనేక మంది యువతుల్ని వంచించినట్లు అంగీకరిస్తున్నాడు. మరోపక్క తాను ఎవరినీ మోసం చేయలేదంటూ చెబుతున్నాడు.  ‘నేను ఎవరినీ మోసం చేయలేదు.. బలవంతంగా అమ్మాయిల్ని వంచంది అత్యాచారమూ జరపలేదు. అలాంటప్పుడు ఏం తప్పు చేసినట్లు సార్?’ అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నాడు.

ఇదిలావుండగా.. మధు చేతిలో వంచనకు గురైనట్లు అనుమానిస్తున్న బాధితులను సంప్రదించడానికి సీసీఎస్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న రిజిస్టర్లలో ‘ఓవర్’, ‘డేంజర్’, ‘వేస్ట్’ అంటూ రిమార్క్స్ ఉన్న వారిని గుర్తించి, ఫిర్యాదులు తీసుకునేందుకు అధికారులు ముమ్మరంగా యత్నిస్తున్నారు. నిందితుడిపై మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. అయితే వీటిలో కొన్ని ఫోన్లు పని చేయకపోవడమో, మరికొన్నింటి నుంచి సరైన స్పందన లేకపోవడమో జరుగుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cyber criminal madhu  madhu reverse interrogation  

Other Articles