AIDS can be Tackled by 2030

Aids can be tackled by 2030

AIDS, India, UN, UNO, Aids in India, The Union Health Ministry, AIDS in 2030

The Union Health Ministry said that India had shown an overall reduction of 57 per cent in new HIV infections in the past decade and expressed confidence that the AIDS epidemic as a public health threat could be tackled by 2030.

2030 నాటికి ఇండియాలో ఎయిడ్స్ మాయం

Posted: 10/31/2015 08:24 AM IST
Aids can be tackled by 2030

ఎయిడ్స్ మహమ్మారి గురించి భారతదేశం ఎంతో ఆందోళన చెందుతోంది. గత కొంత కాలంగా డెంగ్యూ, చికెన్ గున్యాలు తీవ్రంగా ఉండటంతో ఎయిడ్స్ గురించి పెద్దగా వార్తలు రాలేదు. ఎయిడ్స్ ను మించిన ఎబోలాతో ప్రపంచం వణికిపోయింది. అయితే 2030 నాటికి భారత్‌, ఆఫ్రికా దేశాల్లో ఎయిడ్స్‌ వ్యాధి పూర్తిగా కనుమరుగైపోతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మూడవ ఇండో-ఆఫ్రికా ఫోరమ్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి ఈ మాట అన్నారు. అదే సమయంలో ఎయిడ్స్‌ నివారణ యజ్ఞంలో నాసిరకపు ఔషధాలు ప్రవేశించకుండా అడ్డుకో వడానికి ఉభయులు కలిసి ఒక పటిష్టమైన నియంత్రణా వ్యవస్థకు అవసరమైన ప్రణాళికను రూపొందిం చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. హెచ్‌ఐవీ నివారణలో నాసిరకపు, నాణ్యత లేని ఔషధాలను కనిపెట్టడానికి భారత్‌ విస్తృతమైన సర్వే చేపట్టిందని, ఆ సర్వే ద్వారా రిటైల్‌ దుకాణాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పరిశ్రమలు, ఔషధ తయారీ యూనిట్ల నుంచి 47,800 నమూనాలు సేకరించినట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతం వాటిని ప్రభుత్వ ల్యాబ్‌ ల్లో పరీక్షిస్తున్నారని, ఈ సంవత్సరాంతానికి వాటి ఫలితాలు వస్తాయని నడ్డా వెల్లడించారు.

ఐతే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌ నిర్మూలించబడుతుందని దాదాపు నెల రోజుల క్రితం ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదిక చెప్పకనే చెప్పింది. గత ఏడాది విడుదల చేసిన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ బాధితుల విషయానికి వస్తే భారత్‌ మూడవ స్థానంలో ఉందని తేల్చి చెప్పింది. ఆ లెక్కన భారత్‌లో 2.1 మిలియన్ల డాలర్ల మంది హెచ్‌ఐవీ బాధితులున్నారని తెలిపింది. అంటే ప్రపంచంలో ప్రతి 10 మంది హెచ్‌ఐవీ బాధితుల్లో నలుగురు భారతీయులున్నారు. ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ల మంది బాధితులు ఉంటే వారిలో 19 మిలియన్ల మందికి అసలు వారికి హెచ్‌ఐవీ సోకిందనే సంగతి తెలియకపోవడం అత్యంత విచారకరం. ఆ విధంగా చూస్తే 2030 నాటికి ఎయిడ్స్‌ మహమ్మారిని మట్టుబెట్టడం సాధ్యమేనా అన్న సందేహం చాలా మందిలో తలెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIDS  India  UN  UNO  Aids in India  The Union Health Ministry  AIDS in 2030  

Other Articles