బీఫ్ వంటివాటిపై చెలరేగుతున్న దుమారం వల్ల దేశం నమ్మకం కోల్పోతుందని ప్రధాని నరేంద్ర మోడీని మూడీస్ అనలైటిక్స్ హెచ్చరించింది. ఇండియా ఔట్లుక్ పేరుతో విడుదల చేసిన నివేదికలో వృద్ధి లక్ష్యాలను సాధిం చాలంటే హామీ ఇచ్చిన సంస్కరణలను అమలు చేయాలని పేర్కొంది.
అందులో మోదీ ప్రభుత్వం గురించి పేర్కొన్న అంశాలు..
* అధికారంలో ఉన్న బీజేపీకి రాజ్యసభలో ఆధిక్యత లేదు.
* కీలక సంస్కరణల బిల్లులకు ప్రతిపక్షం అడ్డుకుంటోంది.
* ఇటీవలి కాలంలో అధికార పక్షం కూడా తనకు తాను సాయం చేసుకోవడం లేదు.
* బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
* మోడీకి జాతీయవాది ముద్ర దూరమవుతోంది.
* మైనారిటీలను రెచ్చగొట్టే వైఖరివల్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు బయల్దేరుతున్నాయి. హింస పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* రాజ్యసభలో తీవ్ర స్థాయిలో ఎదురు గాలి తప్పదు.
* చర్చ ఆర్థిక విధానం నుంచి దారి మళ్లుతుంది.
* మోడీ తన పార్టీ సభ్యులకు కళ్లెం వేయాలి, లేదంటే దేశీయంగా, అంతర్జాతీయంగా విశ్వసనీయత కోల్పోవ డానికి సిద్ధమవాలి.
సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతం కాగా, ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతం ఉంటుంది. కీలక ఆర్థిక సంస్కరణలు ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతాయి. తద్వారా జీడీపీ వృద్ధి చెందుతుంది. భూ సేకరణ బిల్లు, వస్తువులు, సేవల పన్ను బిల్లు, కార్మిక చట్టాలు వంటివాటికి ఆమోదం పొందడం తప్పనిసరి. 2015లో ఇది సాధ్యమ య్యలా కనిపించడం లేదు, ఐతే 2016లో ఆ అవకా శం ఉన్నట్లు చెప్పవచ్చు. వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థకు స్వల్ప కాలంలో సాయపడేవిధంగానే ఉన్నాయి. దీర్ఘకాలిక వృద్ధి సాధించాలంటే సంస్కరణలు అవసరం. రిజర్వు బ్యాంకు ఈ ఏడాది రెపో రేటును 1.25 శాతం కోత విధించడం ద్వారా రికవరీని ప్రారంభించింది. భారతీ య స్టేట్ బ్యాంకు ఈ నెల ప్రారంభంలో బేస్ లెండింగ్ రేటును తగ్గించడం శుభ పరిణామం. సెన్సెక్స్ దాదా పు 11 శాతం పతనమైంది. కీలక ఆర్థిక సంస్కరణలు అమలు కాకపోవడంతో కొత్త ప్రభుత్వంపై ఆశలు నీరుగారిపోయాయి. ఆర్బీఐ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగిన స్థాయిలో ఉండటం వల్ల రూపాయి రికవరీ అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more