Police giving gifts who wearing helmets

Police giving gifts who wearing helmets

Helmets, Police, madras High court, Gift for wearing Helmet

Tamilnadu police surprising motorists. They are giving gifts to motorists who wear helmets. Police doing awareness programmee on waering helmets.

హెల్మెట్ పెట్టు.. గిఫ్ట్ పట్టు

Posted: 10/29/2015 03:34 PM IST
Police giving gifts who wearing helmets

ఇదేదో..  ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అన్న టీవీషో తరహాలో ఉంది అనుకుంటున్నారా..? కానీ నిజం అది కూడా పోలీసులే గిఫ్ట్ లు ఇస్తున్నారు. వెహికిల్ నడుపుతూ ప్రమాదానికి గురై.. చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది అందుకే హెల్మెట్ ల మీద అవగాహన కల్పించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మధ్యన రోడ్ల మీద గులాబీ పువ్వులు ఇస్తూ.. వాహనదారులకు అవగాహన కల్పిస్తే.. తాజాగా పోలీసులు చేస్తున్న పనికి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హెల్మెట్‌ ధరించి ప్రయాణం చేస్తున్న ద్విచక్రవాహనదారులకు దిండుకల్‌ జిల్లా పోలీసులు బ హుమతులను అందించి అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ ధారణ తప్పనిసరంటూమద్రాసు హై కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసు విభాగం చర్యలు చేపట్టింది. పోలీసులు చేస్తున్న అవగాహనతో చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే కొంతమంది వాహనదారులు ఇప్పటికీ హెల్మెట్‌ ధరిం చకుండా ప్రయాణం చేస్తున్నారు. వీరు కూడా హెల్మెట్‌ పెట్టుకునేలా ప్రోత్సహించడానికి దిండుకల్‌ జిల్లా పోలీసులు చర్యలు చేపట్టింది. హెల్మెట్‌ పెట్టుకుని వాహనాన్ని నడిపేవారికి స్వీట్లు, బహుమతులు అందజేసి అభినందిస్తున్నారు. దిండుకల్‌, పళ నీ, ఒట్టన్‌ చత్రం, కొడైకెనాల్‌, నందం తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలను నిర్వహించిన పోలీసులు హెల్మెట్‌ ధరించి ప్రయాణం చేసే వారికి స్వీట్లు, బహుమతులను పంపిణీ చేశారు. ఇదేదో భలే ఉంది కదా..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Helmets  Police  madras High court  Gift for wearing Helmet  

Other Articles