Gangster Chhota Rajan May Be Kept in Kasabs Cell

Gangster chhota rajan may be kept in kasabs cell

Chhota Rajan, Dawood Ibrahim, Mumbai Police, Rajan arrest, gangster arrested, Bali Police, Indonesia, Denpasar

Chhota Rajan, the gangster arrested in Bali for charges of murder, extortion and arms smuggling, may be kept in the same high-security cell where 26/11 terrorist Ajmal Kasab was lodged. Rajan, if and when he is brought back to Mumbai, is expected to be first put up in the crime branch lock-up in the police headquarters, which is built for high-value prisoners and heavily guarded by special forces and Quick Response Teams. Kasab was kept there just after he was arrested in 2008 for the Mumbai terror attacks.

కసబ్ సెల్ లోకి ఛోటా రాజన్...?

Posted: 10/29/2015 03:24 PM IST
Gangster chhota rajan may be kept in kasabs cell

ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను బంధించిన హై సెక్యూర్టీ సెల్‌లోనే గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను పెట్టే అవకాశాలున్నాయి. ఇండోనేషియాలో ఇంటర్‌పోల్‌కు చిక్కిన చోటా రాజన్ ప్రస్తుతం అక్కడి పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. విచారణ కోసం అతన్ని త్వరలో ముంబై తీసుకొచ్చే ఆలోచనలున్నాయి. ముంబై పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్రైం బ్రాంచ్ లాకప్‌లో చోటాను బంధించాలనుకుంటున్నారు. కరుడుగట్టిన నేరస్తులను బంధించేందుకు అక్కడ ఇలాంటి లాకప్‌లను నిర్మించారు. దాని చుట్టూ ఎప్పుడూ ప్రత్యేక దళాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు గస్తీ కాస్తుంటాయి. 2008లో కసబ్ పట్టుబడిన వెంటనే అతన్ని ఇక్కడి సెల్‌లోనే ఉంచారు.

ఒకవేళ చోటా రాజన్‌ను భారత్‌కు తరలిస్తే...అతనికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి. మాఫియా డాన్‌పై ప్రత్యర్థులు దాడులు చేసే అవకాశం ఉంది. అతని ఇంటరాగేషన్ ను వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటున్నారు. తనను చంపేందుకు బెదిరింపులు వస్తున్నా రాజన్ మాత్రం భారత్ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 55 ఏళ్ల చోటా డాన్ గత రెండు దశాబ్ధాలుగా పరారీలో ఉన్నాడు. అతనిపై మొత్తం 71 కేసులు ఉన్నాయి. బాలీలో పట్టబడ్డ రాజన్ ..జింబాబ్వే వెళ్లాలనుకుంటున్నట్లు తొలుత అక్కడి పోలీసులకు చెప్పాడు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ప్రమాదం ఉన్నట్లు మొదట్లో అతను భయాన్ని వ్యక్తం చేశాడు. చోటా రాజన్ భార్య ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles