Uttar Pradesh CM Akhilesh Yadav sacks 8 ministers

Up cm akhilesh yadav sacks 8 ministers

Uttar Pradesh, Akhilesh Yadav, Samajwadi Party, UP, Mulayam Yadav, CM Akhilesh Yadav

Uttar Pradesh CM Akhilesh Yadav on Thursday sacked eight ministers from his cabinet. Five cabinet ministers and three ministers of state have been dropped from the Akhilesh Yadav government, a Samajwadi Party spokesman said. The Samajwadi Party feels that by presenting that Team Akhilesh is the one firmly in command-- before the 2017 assembly elections -- it could sent a strong message to people who feel Akhilesh doesn't have a free hand in running the UP government.

ఈ సిఎం..8 మంది మంత్రులను తొలగించాడు

Posted: 10/29/2015 04:10 PM IST
Up cm akhilesh yadav sacks 8 ministers

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది మంది మంత్రులను మంత్రి పదవుల నుండి తొలగించారు. నిన్నటి దాకా మెతక వైఖరి అవలంభిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సిఎం ఏకంగా ఎనిమిది మంది మంత్రులను తొలగించడం సంచలనం రేపుతోంది. యంగ్ సిఎంగా బారీ క్రేజ్ ను సంపాదించిన ఉత్తర్ ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మీద గత కొంత కాలంగా వస్తున్న విమర్శలు అఖిలేష్ ను తీవ్ర ఇబ్బందుల్లో నెట్టేసింది. అయితే మరి ఏం ఆలోచించి ఇలా ఏకంగా ఎనిమిది మంది మంత్రులను పదవుల నుండి ఉద్వాసన పలికారో అంటూ యుపి జనాలు గుసగుసలాడుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు.. ఇప్పుడికి చాలా మార్పులు వచ్చాయి. పరిపాలన వ్యవస్థ మీద పట్టులేదని.. గట్టిగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, సత్తా అఖిలేష్ కు లేదు అని విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఐదుగురు కేబినెట్ మంత్రులను, ఇద్దరు సహాయ మంత్రులను తొలగిస్తూ అఖిలేష్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో అఖిలేఫ్ తండ్రి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం యాదవ్ కూడా అఖిలేష్ మీద విమర్శలు గుప్పించారు. బహిరంగ సభలో అందరి ముందు అఖిలేష్ మీద విరుచుకు పడ్డారు. దాంతో కఠిన నిర్ణయానికి వెనక్కి తగ్గడు అన్నట్లుగా తాజాగా అఖిలేష్ ఎనిమిది మంది మంత్రులకు గుడ్ బై చెప్పారు. అయితే 2017 ఎన్నికల్లోపు తిరిగి పార్టీని పటిష్టం చెయ్యాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని కూడా ఓ వాదన వినిపిస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Akhilesh Yadav  Samajwadi Party  UP  Mulayam Yadav  CM Akhilesh Yadav  

Other Articles