a hyderabadi woman saritha dump 150 people with her marriage bureau name to earn more money in simple method | women crime stories

Hyderabadi woman saritha dump 150 people with her marriage bureau

saritha marriage bureau, srirasthu marriage bureau, women dump 150 members, women crime stories, hitech women crimes, marriage bureau crime stories

hyderabadi woman saritha dump 150 people with her marriage bureau : a hyderabadi woman saritha dump 150 people with her marriage bureau name to earn more money in simple method.

మ్యారేజ్ బ్యూరో పేరిట టోకరా వేసిన కి‘లేడీ’

Posted: 10/29/2015 11:05 AM IST
Hyderabadi woman saritha dump 150 people with her marriage bureau

ప్రస్తుత ఆధునిక యుగంలో పురుషులకు సమానంగా మహిళలూ అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారంటే ఏమో అనుకున్నాంగానీ.. మోసాలు చేయడంలోనూ వారు తమకు తామే సాటిగా నిలిచిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వంటబట్టిన కొందరు మహిళలు దాన్నే అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటికే ఎందరో హైటెక్ మహిళలు పలు మోసాలు చేసి పట్టుబడగా.. తాజాగా మరో మహిళ ‘మ్యారేజ్ బ్యూరో’ పేరిట ఎంతోమందికి టోకరా వేసింది. వివిధ కులాల వారికి పెళ్లి సంబంధాలంటూ పత్రికల్లో ప్రకటనలిచ్చి మోసాలకు పాల్పడుతున్న ఆ మహిళను సీసీఎస్ ఆధీనంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతానికి చెందిన సరిత స్థానికంగా ‘శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో’ నిర్వహిస్తోంది. వివిధ తెలుగు పత్రికల్లోని ప్రత్యేక ఎడిషన్లలో కులాలవారీగా పెళ్లి సంబంధాలున్నాయంటూ ఫోన్ నెంబర్లతో సహా ప్రకటనలు ఇచ్చేది. వీటిలో ఉన్న ఫోన్ నెంబర్‌లో ఎవరైనా సంప్రదిస్తే... వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసేది. ఆపై వారి ఆసక్తిని బట్టి ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫొటోలు, నకిలీ ప్రొఫైల్స్ పంపేది. రకరకాల కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ చివరకు సదరు వ్యక్తికి వివాహమైందని, మరో ప్రొఫైల్ పంపిస్తున్నానని నమ్మబలికేది. మళ్లీ అదే తతంగాన్ని ‘నకిలీ’ తతంగాన్ని రిపీట్ చేసేది. ఈ విధంగా ఆమె సృష్టించే కట్టకథలకు విసిగిపోయిన కొందరు వ్యక్తు.. చివరికి వదిలేసేవారు. ఇలా ఎంతోమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాళ్లు ఆమె చేతిలో మోసపోయారు. దీంతో కొందరు బాధితులు ఆమెపై అనుమానం కలిగి ఫిర్యాదు చేశారు.

ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్న సరిత వ్యవహారాలపై సమాచారం అందుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ శంకర్ రాజు నేతృత్వంలోని బృందం లోతుగా ఆరా తీసింది. నలుగురు బాధితుల్ని గుర్తించిన మీదట నిందితురాలిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. బాధితుల సంఖ్య 150కి పైగా ఉంటుందని, వారిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీసీఎస్ అధికారులు చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles