mass maharaja raviteja hot controversial comments on media and difference among tollywood actors | tollywood gossips

Raviteja hot controversial comments on media and difference among tollywood actors

raviteja, bengal tiger movie, raviteja press meet, raviteja controversies, raviteja updaets, raviteja bengal tiger news, raviteja latest controversies, raviteja news, raviteja tamanna, tamanna bhatia hot, tamanna hot photo shoot, rashi khanna hot

raviteja hot controversial comments on media and difference among tollywood actors : mass maharaja raviteja hot controversial comments on media and difference among tollywood actors.

మీడియాపై నిందలు వేసిన హీరో రవితేజ

Posted: 10/23/2015 09:52 PM IST
Raviteja hot controversial comments on media and difference among tollywood actors

ఇండస్ట్రీలో మాస్ మహారాజగా పేరొందిన హీరో రవితేజ చాలావరకు సైలెంట్ గానే వుంటాడు. తన పని తాను చేసుకోవడంలోనే పూర్తిగా నిమగ్నమైవుంటాడు. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకుండా అందరితోనూ సఖ్యతగా వ్యవహరిస్తాడు. అప్పుడప్పుడు మీడియాలో తన గురించి నెగెటివ్ గా వచ్చే వార్తలపైనా ఏమాత్రం సీరియస్ కాకుండా చాలా కూల్ గానే సమాధానాలిస్తాడు. అలాంటి ఈ హీరోకి ఏమైందో ఏమో తెలీదు కానీ.. తాజాగా కాస్త సీరియస్ గా గళమెత్తాడు. మీడియా వేసిన ప్రశ్నకు జవాబు చెబుతూ.. తిరిగి ఆ రంగంపైనే నిందలు మోపేశాడు. ఇంతకీ రవితేజ ఏం చెప్పాడు..? మీడియా ఏ ప్రశ్న అడిగింది? అనే సందేహాలు వీడాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే!

‘బెంగాల్ టైగర్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ.. ప్రస్తుతం ఆ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా వున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రవితేజకు.. మీడియా ఓ ఆసక్తికరమైన ప్రశ్నను సంధించింది. ఇండస్ట్రీలో హీరోల మధ్య వున్న పోటీ ఎటువంటిది? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దానికి రవితేజ కాస్త వేడిగానే జవాబిచ్చాడు. సీనిరంగంలో పోటీ వుందన్న విషయం వాస్తవమేగానీ.. అది ఆరోగ్యకరమైనదే తప్ప ద్వేషాలు పెంచుకునే స్థాయి పోటీ కాదని వివరణ ఇచ్చాడు. అంటే.. సినిమాపరంగా హీరోల మధ్య పోటీ వుంటుంది కానీ వ్యక్తిగతంగా అందరూ స్నేహభావంతోనే మెలుగుతుంటారని రవితేజ స్పష్టం చేశాడు. సినిమా వాళ్ల మధ్య గొడవలన్నీ మీడియా వాళ్లు కల్పించినవేనంటూ కాస్త ఘాటుగా వ్యాఖ్యానించాడు.

సినీ నటులంతా ఏదో ఒక సందర్భంలో కలుస్తుంటారని, అప్పుడు వారి మధ్య ఆప్యాయతలు చూస్తే వారి మధ్య ఉన్నది స్నేహమో లేక వైరమో తెలుస్తుందని క్లారిటీ ఇచ్చాడు. ప్రతి రంగంలోనూ చిన్నచిన్న కలహాలు, అభిప్రాయ భేదాలు ఉండడం సహజమని అన్నాడు. సినీనటుల విషయంలో మీడియా మసాలాలు దట్టించి వండి వారుస్తుందని, దీంతో ఈ రంగంలో ఒకరంటే ఒకరికి పడదని అంతా భావిస్తారని రవితేజ చెప్పాడు. నిజానికి సినీనటుల మధ్య వైరుధ్యాలు ఏమాత్రం వుండదని, మీడియావాళ్లు సృష్టించే కథనాల కారణంగా అటువంటి ప్రచారాలు వెలుగులోకి వస్తాయని రవితేజ స్పష్టం చేశాడు. అయితే.. రవితేజ వెల్లడించిన ఈ అభిప్రాయంపై మీడియావాళ్లు కాస్త గుర్రుగానే వున్నారని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja  telugu media  bengal tiger movie  tamanna bhatia  

Other Articles