Pawan Kalyan will come to Amaravati inauguration

Pawan kalyan will come to amaravati inauguration

AP, Amaravati, Pawankalyan, Pawan Kalyan for Amaravati, Invitation, janasena, Pawan Kalyan News, Amaravati News

Ap Minister Yanamala Ramakrishnudu said that Pawan Kalyan will come to Amaravati inauguration. AP Ministers kamineni srinivas, Ayyannapatrudu gave invitation for Amaravati inauguration.

అమరావతికి పవన్ కళ్యాణ్ వస్తారు

Posted: 10/19/2015 12:26 PM IST
Pawan kalyan will come to amaravati inauguration

అమరావతి శంకుస్థాసనకు పవన్ కల్యాణ్ వస్తారా.? రారా..? అన్న సందిగ్దానికి మంత్రులు తలా ఓ మాట మాట్లాడుతున్నారు. ఏపి మంత్రులు పవన్ వస్తారనే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. తనకు రావాలనే ఉంది అని పవన్.. అమరావతి శంఖుస్థాపన ఆహ్వానం అందుకున్నాక ప్రకటించారు. ఏపీ నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పక వస్తారని తాము ఆశిస్తున్నామని తాజాగా ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అమరావతి శంకుస్థాపనకు రావాలని ఉన్నా.. అదే సమయంలో షూటింగ్ ఉందని పవన్ కల్యాణ్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ హాజరుపై సందేహాలు నెలకొన్నాయి.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి యనమలకు.. అమరావతి శంకుస్థాపన కోసం నీలకంఠేశ్వరస్వామి ఆలయం మట్టిని, నిజాంసాగర్ మట్టిని జిల్లా టీడీపీ నేతలు అందించారు. ఏపీ ప్రజలు గర్వపడేలా అమరావతి నిర్మాణం ఘనంగా చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజధాని శంకుస్థాపనకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామన్న మంత్రి యనమల..వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు. రాజధాని శంకుస్థాపన ఆహ్వానాన్ని జగన్ నిరాకరించడం సిగ్గుచేటన్నారు. జగన్ నిర్ణయాన్ని వైసీపీ నేతలే తప్పుపడుతున్నారని యనమల చెప్పారు. జగన ఓ సైకో నేత అన్న ఆయన.. శంకుస్థాపకు రావడం రాకపోవడం ఆయన ఇష్టమన్నారు. ప్రజలు విడిపోయినా తెలుగు రాష్ట్రాల ఔన్నత్యమే టీడీపీ లక్ష్యంమని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు తక్కువ ఖర్చుతోనే భూమిపూజ ఘనంగా నిర్వహిస్తామని మంత్రి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles