cpi leader cherian philip controversial comments on women who are in politics | facebook controversy | fb updates

Cherian philip controversial comments on political women in his facebook account

cherian philip news, cherian philip updates, cherian philip news, cherian philip facebook, cherian philip controversy, women in politics, cherian philip women controversies

cherian philip controversial comments on political women in his facebook account : cpi leader cherian philip controversial comments on women who are in politics.

ఎన్నికల్లో టికెట్ల కోసం బట్టలు విప్పిన మహిళలు

Posted: 10/19/2015 12:16 PM IST
Cherian philip controversial comments on political women in his facebook account

రాజకీయాల్లో స్థానం సంపాదించుకోవడం కోసం ప్రతిఒక్కరు నానాతంటాలు పడుతుంటారు. నలుగురిలో గుర్తింపు కోసం సంచలన వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర దుమారానికి తెర లేపుతుంటారు. ఈ తరహాలోనే ఓ మాజీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరో కొత్త సంచలనానికి తెరలేపారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వుండి ఇప్పుడు సీపీఐ తీర్థం పుచ్చుకున్న చెరియన్ ఫిలిప్.. ‘కేరళలో మహిళా కాంగ్రెస్ నేతలు కొందరు ఎన్నికల్లో టికెట్లను సంపాదించుకునేందుకు పెద్దల వద్ద బట్టలు విప్పారంటూ’ సంచలన వ్యాఖ్య చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది.

కాంగ్రెస్ మాజీ నేత ఏకే ఆంటోనీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఫిలిప్.. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ.. ‘స్థానిక ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోలేక పోయిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. గతంలో నేతల వద్ద ఇదే పని చేసిన కొందరు మహిళా కార్యకర్తలు టికెట్లను పొందారు’ అని అన్నారు. ఈ విధంగా ఈయన చేసిన పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నేతలు, మహిళా సంఘాలు ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. మహిళా నేతల గౌరవం దిగజారేలా వ్యాఖ్యలు చేసిన ఫిలిప్ ని వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ వివాదంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది.

దీంతో దిగివచ్చిన ఫిలిప్.. ‘నేను మహిళలకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. నేను ఎప్పుడూ వారిని గౌరవిస్తాను. మహిళలను అవమానిస్తున్న కొందరు నేతల తీరును మాత్రమే వేలెత్తి చూపాను’ అని వివరణ ఇచ్చారు. మరోవైపు.. తక్షణం ఆయన తన వ్యాఖ్యలను విరమించుకోవాలని, మహిళలకు క్షమాపణ చెప్పాలని కేరళ పీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్ డిమాండ్ చేశారు. ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నట్టు మహిళా కాంగ్రెస్ నేతలు బిందుక్రిష్ణ, షనిమోల్ ఉస్మాన్ హెచ్చరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cherian philip  women in politics  political controversies  

Other Articles