A Twist Came On Pakistan Girl Geetha Story | bajrangi bhaijaan movie story | pakistan girl geetha story

Pakistan girl geetha story new twist bihar family members marriage gossips

pakistan girl geetha story, geetha story twist, geetha special story, geetha family members, geetha family twist, indian government, pakistan government, geetha real family

Pakistan Girl Geetha Story New Twist Bihar Family Members Marriage Gossips : A Twist Came On Pakistan Girl Geetha Story who missed from india before 14 years.

పాకిస్థాన్ గీత కథలో సరికొత్త ట్విస్ట్..!

Posted: 10/19/2015 10:08 AM IST
Pakistan girl geetha story new twist bihar family members marriage gossips

‘బజరంగీ భాయిజాన్’ సినిమాలాగే పాకిస్థాన్ లోని గీత కథ గురించి అందరికీ తెలిసిందే! ఇండియాకు చెందిన గీత చిన్నప్పుడు తప్పిపోయి పాకిస్థాన్ లోకి ఎంట్రీ అవ్వగా.. అక్కడ ఓ కుటుంబం ఆమెను చేరదీసుకొని పోషించారు. 14 సంవత్సరాలపాటు అక్కడే వున్న గీత కథ ‘బజరంగీ భాయిజాన్’ సినిమా తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో 14 ఏళ్లు అజ్ఞాత వాసంలో వున్న ఆమె కథ సుఖాంతం అవుతుందనుకున్న తరుణంలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది.

గీతకు సంబంధించిన నిజమైన కుటుంబసభ్యులు ఎవరో సంప్రదిస్తే ఆమెను తిరిగి పంపిస్తామని ఆమెను పోషించిన పాకిస్థాన్ కుటుంబం చెప్పిన నేపథ్యంలో.. ఇండియా నుంచి కొన్ని కుటుంబాలు స్పందించాయి. దీంతో తికమక చెందిన భారత ప్రభుత్వం.. బాగా విచారించిన తర్వాత గీత కుటుంబసభ్యులెవరో కనుగొనగలిగారు. బీహార్ లో వుండే ఓ కుటుంబం గీత తమ కూతురేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గీతను బిహార్‌లోని ఆమె కుటుంబ సభ్యులతో స్కైప్ (వీడియో కాలింగ్)లో మాట్లాడిస్తే.. వారిని చూసి వీళ్లే కుటుంబ సభ్యులేనని గుర్తించింది కూడా! దాంతో ఆమెను ఇండియాకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతో గీత కథ ఓ కొలిక్కి వచ్చిందన్న నేపథ్యంలోనే ఒక ట్విస్ట్ వచ్చి పడింది.

గీతకు మైనర్‌గా ఉన్నప్పుడే ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి ఓ బాబు కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. తనకు అసలు పెళ్లి కాలేదని గీత అంటోంది. దీనికి తోడు తప్పిపోకముందు దిగిన ఓ బాలిక ఫొటోను చూపించినా.. అది తనది కాదని గీత స్పష్టం చేసింది. ఈ తరుణంలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయని.. ఈది ఫౌండేషన్ నిర్వాహకుడు ఫైజల్ ఈది తెలిపారు. గీత తమదగ్గర ఏమైనా దాస్తోందా లేక.. తప్పుదారి పట్టిస్తోందా అనే విషయాలు ఆమెతో మాట్లాడాకే నిర్ధారిస్తామన్నారు. అటు గీత కుటుంబ సభ్యులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాకే అప్పగిస్తారని.. పాకిస్తాన్‌లో భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్ తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pak girl geetha story  india pakistan news  bajrangi bhaijan story  

Other Articles