My Brick My Amaravati

My brick my amaravati to accept donations for new capital

Chandrababu Naidu, Amaravati, Andhra Pradesh capital, Andhra capital, Vijayawada, e-bricks, Andhra new capital

My Brick My Amaravati to accept donations for new capital. The Andhra Pradesh Chief Minister launched My Brick My Amaravati, an exclusive website where donors can purchase symbolic bricks that will cost Rs.10 each.

ఒక్కో ఇటుక పేరుస్తున్న చంద్రబాబు

Posted: 10/16/2015 08:12 AM IST
My brick my amaravati to accept donations for new capital

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఒక్కో ఇటుకను పేరుస్తున్నారు. అమరావతి శంఖుస్థాపన తేది దగ్గరపడుతున్న కొద్ది అమరావతి ఏర్పాట్లు, డొనేషన్స్ మీద చంద్రబాబు దృష్టిసారించారు. అమరావతిని ప్రజా రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు ప్రజల బాగస్వామ్యాన్ని కోరుతోంది. శక్తిమేరకు అమరావతి నిర్మాణానికి ఇటుకలను డొనేట్ చెయ్యాలని కోరుతూ.. కొత్తగా అమరావతి కోసం మై బ్రిక్ మై అమరావతి ని ప్రారంభించారు. అందులో బాగంగా పది రూపాయల విలువ గల ఇటుకలను ప్రజలు డొనేట్ చేయవచ్చు.

ప్రారంభించిన కొద్ది గంటల్లోనే 2 లక్షలకుపైగా ఇటుకలను ఔత్సాహికులు కొనుగోలు చేశారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారిని అమరావతి నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు ‘ఈ-ఇటుక’లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక్కో ఈ-ఇటుకను 10రూపాయలు చొప్పున వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చేందుకు పేమెంట్‌ గేట్‌ వే ఆన్‌లైన్‌ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ-ఇటుకలను కొనుగోలు చేసిన వారి పేరును ఎలక్ర్టానిక్‌ డేటాలో నమోదు చేస్తున్నారు. ఈ-ఇటుకలను కొనుగోలు చేసిన వారికి సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన సర్టిఫికెట్లు పంపించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

మీరు కూడా అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకుంటే.. మరిన్ని విరాల కోసం చూడండి..http://amaravati.gov.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles