Diesel price hiked by 95 paise a litre by midnight Thursday

Diesel rates up by 95 paise no hike in petrol price

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

Diesel price was on Thursday hiked by 95 paise per litre but there will be no change in petrol rates. Diesel will cost Rs 45.90 per litre with effect from midnight Thursday

డీజిల్ ధరకు రెక్కలు.. పండగ పూట కొనుగోలుదారులకు వాతలు

Posted: 10/15/2015 10:25 PM IST
Diesel rates up by 95 paise no hike in petrol price

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కొనుగోలుదారుల జేబుకు చిల్లులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, ఇంధన సంస్థలు సిద్దమయ్యాయి. బిహార్ ఎన్నికల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిన కేంద్రం.. పెట్రోల్ ధరలను ఏ మాత్రం అంటిముట్టనట్టు వ్యవహరించి.. డీజిల్ ధరలకు మాత్రం పెంచేసింది. దీంతో పండుగ పర్వదినాన నిత్యవాసర సరుకులను కొనుగోలు చేసుకునే వారి పర్సుల్లో బరుపు తగ్గనుంది. లీటరు డీజిల్ పై 95 పైసలు మేర ధరను పెంచిన ఇంధన సంస్థలు.. పెరిగిన ధరలను ఇవాళ అర్థరాత్రి నుంచే అమలుపర్చనున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడం, భారత క్రూడ్ బాస్కెట్ బ్యారల్‌కు రూ.3 వేల కిందకు రావడంతో పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గుతాయని ఆశించిన వాహనదారులకు కేంద్రం చేదు వార్తనే అందించింది. ఓ వైపు డీజిల్, పెట్రోల్ పై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంఖం.. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వాల విధిస్తున్న విలువ ఆధారిత పన్నులను మినహాయించాలని డిమాండ్ చేస్తూ.. రావాణా రంగం సమ్మెలకు పిలుపునిస్తున్న తరుణంలో.. డీజిల్ ధరలను తగ్గిస్తారనుకున్న వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. గురువారం నాటి సెషన్లో ఇండియన్ క్రూడాయిల్ సెషన్ ధర బ్యారల్ కు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.46 తగ్గి రూ.2,988 దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం ధర తగ్గింది. అయినా డీజిల్ ధరను పెంచడమేంటని పలువురు పెదవి విరుస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  

Other Articles