KTR enjoying for selfies with heroines

Ktr enjoying for selfies with heroines

KTR, KCR, Telangana, Telangana Govt, Selfie, Farmers, Suicide, Sravan, Dasoju Sravan, TRS Govt

KTR enjoying for selfies with heroines. Dasoju Sravan slams Telanagana govt, TRS, KCR and KTR. He said that Telangana Minister KTR enjoying for selfies with heroines

హీరోయిన్లతో సెల్ఫీలు.. కేటీఆర్ ఎంజాయ్ ఎంజాయ్

Posted: 10/16/2015 08:16 AM IST
Ktr enjoying for selfies with heroines

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన గళాలు పెరుగుతున్నాయి. టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని.. రైతులను పట్టించుకోవడం లేదని ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి, టిడిపి నాయకులు అంతెత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా దాసోజు శ్రావణ్  టిఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని ఏకంగా పిచ్చి కుక్క అని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీదే కాకుండా కేటీఆర్ మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి.. కేటీఆర్‌ హీరోయిన్లతో సెల్ఫీలు దిగుతూ సంబరపడిపోతున్నారని అన్నారు. ఆయనకు సెల్ఫీల మీద ఉన్న శ్రద్ధ సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, నేత కార్మికుల మీద లేకుండా పోయిందన్నారు. ప్రారంభానికే నోచుకోని వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై యూపీకి వెళ్లి ఆ రాష్ట్ర సీఎం అఖిలేష్‌ యాదవ్‌కు ప్రజెంటేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్‌ వ్యవహారం చూస్తే ఏదో అనుమానం కలుగుతోందని అన్నారు.

రాష్ట్రానికి కాపలాకుక్కలాగా ఉంటామని చెప్పిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. పిచ్చికుక్కులా ప్రవర్తిస్తోందని దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పిట్టల్లా రాలుతుంటే వారికింత స్థైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌ను ఆడిపోసుకోవడం సిగ్గు మాలిన చర్య అని ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో నేతలు పీ కార్తీక్‌రెడ్డి, అధికార ప్రతినిధి గోసుల శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు తనకూ, తన కుటుంబానికి అధికారమే వద్దనీ, దళితులకే పదవులిస్తానని చెప్పి ఇప్పుడు కుటుంబ సభ్యులు నలుగురే మొత్తం రాజ్యం నడుపుతున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ యాత్రలు చేస్తుందని మంత్రి హరీశ్‌ మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాము నిజంగా అలా ఆలోచిస్తే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చేదే కాదన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్‌, జలపతి రావ్‌లు... రైతు ఆత్మహత్యలపై కోర్టులో కేసు వేయడం.. రైతు ఆత్మహత్యలకు రుణమాఫీ విఫలం కావడమే కారణం అని అనడం కుక్కకాటుకు చెప్పుదెబ్బలాంటిదని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  KCR  Telangana  Telangana Govt  Selfie  Farmers  Suicide  Sravan  Dasoju Sravan  TRS Govt  

Other Articles