Railway Department To Introduce New Method For Waiting List Passengers | Dussehra Season

Railway department bumper offer for waiting list passengers

waiting list passengers, railway department, railway reservation, railway passengers, waiting list new methods, waiting list controversies, railway waiting lists

Railway Department Bumper Offer For Waiting List Passengers : Railway Department To Introduce New Method For Waiting List Passengers.

‘వెయిటింగ్ లిస్ట్’ ప్యాసెంజర్స్ కి బంపరాఫర్

Posted: 10/15/2015 10:47 AM IST
Railway department bumper offer for waiting list passengers

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దసరా పండుగ వాతావరణం నెలకొంది. దీంతో.. దూరప్రాంతాల్లో పనిచేస్తున్న వారందరూ తమతమ ఇళ్లకు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అయితే.. ఇక్కడో చిన్న ప్రాబ్లమ్. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణించే వారికి సీట్లు దొరకడం చాలా కష్టమైపోయింది. రిజర్వేషన్లు సైతం ముందుగానే అయిపోవడంతో.. టికెట్లు దొరకడం గగనంగా మారింది.  ఈ దెబ్బతో.. ముందురోజు తత్కాల్ కోసం ప్రయత్నిద్దాం అనుకునేవాళ్లే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇక ‘వెయిటింగ్ లిస్టు’ ప్యాసింజర్ల సంగతి ఆ దేవుడే ఎరక! ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే శాఖ ఓ అద్భుతమైన ఆఫర్ తో ముందుకొచ్చింది. వెయిటింగ్ లిస్టులో ఉన్నవాళ్ల టికెట్లు రద్దు చేయడానికి బదులు, అదే మార్గంలో వెళ్లే మరో రైల్లో వాళ్లకు సీట్లు కేటాయించాలని రైల్వేశాఖ భావిస్తోంది.

నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త పద్ధతి ప్రకారం.. టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే వెయిటింగ్ లిస్టు వస్తే, ఆ రైలు కాక మరేదైనా రైల్లో వెళ్లాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఒక స్టేషన్ కాకుండా చుట్టుపక్కల ఉండే మరేదైనా స్టేషన్ నుంచి అయినా బయల్దేరాలనుకుంటే ఆ వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ కొత్త సిస్టమ్ కారణంగా ప్రయాణికులతో పాటు రైల్వేశాఖకు కూడా చాలావరకు తలనొప్పులు తగ్గుతాయి. ప్రయాణికులు ఒకసారి టికెట్ బుక్ చేసుకుంటే చాలు.. ఆ మార్గంలో ఎంతమంది ఉన్నారో చూసుకుని, అవసరమైతే ప్రత్యేక రైళ్లను కూడా అప్పటికప్పుడే వేసి, వాటిలోకి వీళ్లను సర్దేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే మిగిలిన సీట్లను కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించొచ్చు. ఈ కొత్త వ్యవస్థను నవంబర్ 1 నుంచి అమలుచేయాలని ఇప్పటికే అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వేశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చేశాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway waiting list passengers  railway department  

Other Articles